అంతేకాదు ఇండస్ట్రీలోకి వచ్చే కొత్త అమ్మాయిలకు ఈ క్యాస్టింగ్ కౌచ్ నుంచి భద్రత కలుగుతుందా అంటే అది కూడా లేదని చెప్పాలి. హీరోయిన్ దివి కూడా క్యాస్టింగ్ కౌచ్ పై నోరు విప్పి అందరికీ ఆశ్చర్యాన్ని గురిచేసింది. బిగ్ బాస్ తెలుగులో సీజన్ ఫోర్ లో అవకాశం తగ్గించుకొని బుల్లితెర ప్రేక్షకులను కూడా బాగా అలరించిన ఈ ముద్దుగుమ్మ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత బ్యాక్ టు బ్యాక్ అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతోంది. క్యాబ్ స్టోరీస్ అని వెబ్ సిరీస్ లో నటించిన ఈమె గాడ్ ఫాదర్ సినిమాలో కూడా కీలకపాత్ర పోషించి ప్రేక్షకులను అలరించింది.
ఇప్పుడు సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప2 సినిమాలో కూడా ఈమె నటిస్తున్నట్లు తెలుస్తోంది ఎందుకంటే తాజాగా సినిమా ట్రైలర్ను విడుదల చేయగా అందులో దివి న్యూస్ యాంకర్ గా పనిచేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె కాస్టింగ్ కౌచ్ పై మాట్లాడుతూ తను ఎప్పుడు ఈ సమస్యను ఎదుర్కోలేదు. అయితే ఏ నటి అయినా సరే తాను నడుచుకునే తీరని బట్టి ఇలాంటి సమస్యలు ఎదురవుతాయి అంటూ హాట్ బాంబు పేల్చింది.