తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా  రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ  భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నట్లుగానే తెలుస్తుంది. ఈ రెండు చోట్ల కూడా సాక్షి ఉంది.‌ టీ న్యూస్ ఉంది. నమస్తే తెలంగాణ ఉంది. వీటి మీడియా అంతా కూడా భారతీయ జనతా పార్టీ పైన వ్యతిరేకంగా న్యూస్ లు చేసుకొస్తాయి. కానీ తెలుగుదేశం చేసినంత ప్రోపగండా అయితే చేయవని తెలుస్తుంది. పర్టిక్యులర్గా తెలుగుదేశం అనుకూల మీడియాని ఎందుకు చెప్పుకుంటున్నామంటే అది కూడా పర్టిక్యులర్గా భారతీయ జనతా పార్టీని చీల్చి చెండాడుతుందని తెలుస్తుంది.


ఒకవేళ తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీతో కలిసి వెళ్లకపోతే ఇలా ఉంటుందన్నట్లుగా వాళ్లు ప్రాజెక్ట్ చేస్తున్నట్లుగా అంటున్నారు కొంతమంది. ఆంధ్రప్రదేశ్ లోని బిజెపిలో సోము వీర్రాజుని దెబ్బ కొట్టడానికి, ఇంకా అక్కడ బండి రమేష్ నీ దెబ్బ కొట్టడానికి తద్వారా చీలికలు తీసుకురావడానికి ఆంధ్రజ్యోతి ఇంకా ఈనాడు ప్రయత్నిస్తున్నట్లుగా అంటున్నారు కొంతమంది రాజకీయ‌ నిపుణులు.. వీటికి సంబంధించిన పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్లు భారత రాష్ట్రీయ సమితికి ఎంత విధేయులో, తెలుగుదేశం పార్టీకి అంతకన్నా వీర విధేయులు అని తెలుస్తుంది.


వీళ్ళిద్దరూ ఈ విధంగా బిజెపిపై ప్రోపగండా వార్ చేస్తున్నట్లుగా తెలుస్తుంది. ఒక వర్గం సోషల్ మీడియాలో ఒక పక్కన భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తున్నారు. అలాగే వీళ్లిద్దరూ కలిసి రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారతీయ జనతా పార్టీని టార్గెట్ చేస్తున్నారు అన్నట్లుగా తెలుస్తుంది. ఆ విధంగా వాళ్ళు భారతీయ జనతా పార్టీని రెండు చోట్ల భారీగా దెబ్బతీస్తున్నారు.


ఇదే పరిస్థితులు ఒకప్పుడు బెంగాల్లో ఏర్పడ్డాయని తెలుస్తుంది. బెంగాల్లో మమతా బెనర్జీ మీద కమ్యూనిస్టులు కూడా మీడియా సహాయంతో టార్గెట్ చేశారని తెలుస్తుంది. అదేవిధంగా కమ్యూనిస్టులను కాంగ్రెస్ పార్టీ వాళ్లు కూడా టార్గెట్ చేశారట. అప్పుడు ఆ  పార్టీ వాళ్లు కలిసి ఆ మీడియా కార్యాలయాల ముందు ఆందోళనలు చేశారట. ఈ పరిస్థితుల్లో బిజెపి ఏం చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

BJP