అయితే ఇందులో రెండు విభిన్న పాత్రలు పోషించింది ఒక అమ్మాయి. అందులో తన అమాయకమైన నటనతో ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న కీర్తన.. సంవత్సరాల పాటు టెలివిజన్ రంగంలో నంబర్ వన్ టి ఆర్ పి రేటింగ్తో దూసుకుపోయిన ఈ సీరియల్ కి అప్పట్లో అభిమానులు కూడా ఎక్కువగా ఉండేవారు. మొగలిరేకులు సీరియల్ లో కీర్తన, సింధు అంటూ రెండు విభిన్న పాత్రల్లో కనిపించిన అమ్మాయి మేధా.. ఇప్పటికీ బుల్లితెర ఆడియన్స్ కి ఫేవరెట్ హీరోయిన్ గా మారిన మేధా మొగలిరేకులు కంటే చక్రవాకం సీరియల్ లో కనిపించి ప్రేక్షకులను అలరించింది.
మొగలిరేకులు తర్వాత సూర్యపుత్రుడు, అపరంజి వంటి సీరియల్స్ లో నటించిన ఈమె ఆ తర్వాత సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంది. అలా చివరిసారి రాజేంద్రప్రసాద్ నటించిన మీ శ్రేయోభిలాషి సినిమాలో నటించిన ఈమె అవకాశాలు వస్తున్నా కాదనుకొని ఇండస్ట్రీకి దూరం అయింది. సీరియల్స్ లోకి ఎంట్రీ కాకముందే పలు ప్రకటనలు చేసిన మేధా.. సుమిత్ అనే ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని వివాహం చేసుకొని ఒక కొడుకుకు జన్మనిచ్చింది. ఇక పూర్తిగా ఇండస్ట్రీకి దూరమైన మేధా ఎక్కువగా తన ఫ్యామిలీతోనే సమయం గడుపుతోంది. అడపాదడపా సోషల్ మీడియాలోకి వస్తూ తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను విషయాలను వెల్లడిస్తోంది. ఇకపోతే మళ్లీ మేధా ఇండస్ట్రీలోకి రావాలని, సీరియల్స్ లో చేయాలి అని అభిమానులు ఆకాంక్షిస్తున్నారు.