
ఇకపోతే ఈ జంటపై ప్రేక్షకులలో నేటిజనులలో నెగిటివిటీ ఏర్పడినా సరే సినీ ఇండస్ట్రీలో మాత్రం వీరికి మంచి పాజిటివ్ లభిస్తోంది.అంతేకాదు అందుకు తగ్గట్టుగా పలువురు సెలబ్రిటీలు కూడా వీళ్లకు మద్దతుగా నిలుస్తూ ఉండడం గమనార్హం. ఈ క్రమంలోనే కార్తీకదీపం సీరియల్ ద్వారా మరింత పాపులారిటీ దక్కించుకున్న సౌందర్య అలియాస్ అర్చన అనంత్ తాజాగా నరేష్, పవిత్ర జంటకు మద్దతు పలుకుతూ కామెంట్లు చేయడం ఇప్పుడు మరింత హాట్ టాపిక్ గా మారింది.
నరేష్ ,పవిత్ర లోకేష్ ఇద్దరు కూడా ఒకరినొకరు ఇష్టపడ్డారు . అయితే అది వాళ్ళ పర్సనల్.. ఒక పర్సన్ మీద ఒకరికి ఇంట్రెస్ట్ కలగడం అనేది పూర్తి గా వారి వ్యక్తిగతమైన విషయము ఇక ఆ విషయంలో మన అమ్మానాన్నలకి కూడా ఎటువంటి సంబంధము ఉండదు ముఖ్యంగా వాళ్లకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఉంటే కచ్చితంగా వాళ్ళు పెళ్లి చేసుకోవచ్చు ఇక వాళ్లను ఎవరిని ఆపలేరు అది చూసే వాళ్ళకి కరెక్ట్ అనిపించకపోవచ్చు కానీ అది వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ కాబట్టి వాళ్లపై కామెంట్లు చేసే హక్కు ఎవరికీ లేదు అంటూ వారికి మద్దతుగా నిలిచింది అర్చన అనంత్.