వాస్తవానికి ఈమె తెలుగు అమ్మాయి కాదట ముంబైలో పుట్టి పెరిగి ఆ తర్వాత బెంగళూరుకి వచ్చారని.. ప్రస్తుతం హైదరాబాదులో సెటిల్ అయిందని సమాచారం. ఇకపోతే సీరియల్స్ లో నటించడానికి కంటే ముందే కన్నడలో ఒక సినిమా చేసిన ఈమె అక్కడ గోలి సోడా అనే సినిమాలో నటించి మెప్పించింది. ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చి వినరా సోదర వీరకుమారా, చల్తే చల్తే వంటి సినిమాలలో నటించి మౌనరాగం సీరియల్ లో అవకాశాన్ని దక్కించుకుంది.
ఇకపోతే ఒకవేళ తెలుగు సినిమాలలో నటించాల్సిన అవసరం వస్తే కచ్చితంగా తనకు నాగార్జునతోనే నటించాలని ఉందని.. తన మనసులో మాటలను బయటపెట్టింది ఈ ముద్దుగుమ్మ. అందుకే ఆయన సినిమాలో తనకు చిన్న రోల్ వచ్చిన చాలు అని నాగార్జున అంటే అంత ఇష్టం అంటూ చాలా సంతోషంగా చెప్పింది ప్రియాంక. ఇకపోతే తన సినీ కెరియర్ గురించి అలాగే తన లైఫ్ గోల్ గురించి కూడా ఎన్నో విషయాలను ఆమె చెప్పుకుంది. ఏది ఏమైనా ప్రియాంక చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతున్నాయి.