చిన్న చిన్న సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లను కూడా వదలని సుమా ఈసారి ఆది పురుష్ వంటి భారీ బడ్జెట్ సినిమా ఈవెంట్ను ఎందుకు మిస్ చేసుకుంది అనే డౌటు చాలామందిలో వచ్చింది. అయితే సుమ ఎందుకు మిస్ చేసుకుంది ఆ అవకాశం ఝాన్సీ కి ఎలా వచ్చింది అంటూ అందరూ కదా తమ డౌట్ లను తెగ వ్యక్త పరుస్తున్నారు. ప్రభాస్ రాముడిగా కృతిసనన్ సీతగా నటిస్తున్న ఆది పురుష్ సినిమా జూన్ 16వ తేదీన ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలతో పాటు పలు విదేశీ భాషల్లో కూడా రిలీజ్ అవుతుంది . ఇప్పటికే సినిమాకి మంచి పాజిటివ్ బజ్ కూడా ఏర్పడింది.
తిరుపతిలో రూ.3 కోట్లు ఖర్చు చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా చాలా గ్రాండ్ గా నిర్వహించారు. ఇక్కడ సుమా కాకుండా ఝాన్సీ కనిపించేసరికి అందరూ ఆశ్చర్యపోయారు . సుమా రాకపోవడానికి కారణం ప్రస్తుతం ఆమె హైదరాబాదులో లేరట. సమ్మర్ వెకేషన్ ఎంజాయ్ చేసేందుకు భర్త పిల్లలతో కలిసి విదేశాలకు వెళ్లడం వల్లే ఆ అవకాశం ఝాన్సీకి ఇచ్చినట్లు తెలుస్తోంది. ఏమైనా ఒక గొప్ప అవకాశాన్ని వదులుకుంది సుమా అని చెప్పవచ్చు.