జబర్దస్త్ ద్వారా తనకంటూ మంచి పేరు తెచ్చుకొని పంచ్ లతో ప్రేక్షకులను అలరించిన పంచ్ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇకపోతే ముందు నుంచే పంచ్ ప్రసాద్ కి అనారోగ్య సమస్య ఎక్కువైందని ఆ జబ్బు వల్లే ఆయన మరింత పాపులారిటీ అయ్యారు అనే వార్తలు వినిపిస్తూ ఉంటాయి గతంలోనే రెండు కిడ్నీలు చెడిపోయి భారీగా ఇబ్బంది పడ్డ ఆయన ఇటీవల తన భార్య కూడా ఒక కిడ్నీ దానం చేయడానికి సిద్ధమయింది కానీ కొన్ని కారణాలవల్ల ఆమె కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కి మ్యాచ్ అవ్వకపోవడంతో అది కాస్త జరగలేదు.

అయితే ఎప్పటికప్పుడు పంచ్ ప్రసాద్ తన కి డయాలసిస్ చేయించుకుంటూ వస్తూ ఉన్నాడు. అయితే గతంలో కూడా ఒకసారి సీరియస్ అయినప్పుడు నాగబాబు,  రోజా లు జబర్దస్త్ లో జడ్జిగా ఉన్న నేపథ్యంలో వారే ముందుండి నడిపిస్తూ కొన్ని లక్షల రూపాయల డబ్బులు వసూలు చేసి జబర్దస్త్ కుటుంబ సభ్యులందరికీ తరఫున పంచ్ ప్రసాద్ కుటుంబానికి అందజేసి ఆయనను ఆదుకున్నారు. అయితే ఆ తర్వాత పంచ్ ప్రసాద్ కోలుకుని తన పని తాను చేసుకోగలిగారు అయితే ఇప్పుడు ఆయన ఆరోగ్యం మరింత క్షీణించడంతో మరొకసారి సర్జరీ చేయాల్సిన అవసరం ఏర్పడిన నేపథ్యంలో సుమారు ఐదు రోజుల నుంచి జబర్దస్త్ కమెడియన్ల అందరూ కూడా పంచ్ ప్రసాద్ కుటుంబానికి అండగా నిలవాలని కోరుతూ తోచినంత డబ్బు సహాయం చేయాలి అని సోషల్ మీడియా వేదికగా కోరుకుంటున్నారు.

ఈ నేపథ్యంలో ఈ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సహాయనిధి కార్యక్రమాలన్నీ పర్యవేక్షించే డాక్టర్ మామిడి హరికృష్ణకు ఒక నెటిజన్ ట్యాగ్ చేయగా ఈ విషయంపై స్పందించిన హరికృష్ణ ఇప్పటికే తన టీం పంచ్ ప్రసాద కుటుంబ సభ్యులతో టచ్లోకి వెళ్ళింది అని వారితో లెటర్ ఆఫ్ క్రెడిట్ అప్లై చేయించేందుకు పలు ప్రయత్నాలు కూడా చేస్తున్నామని ఆయన తెలిపారు. అన్నీ పరిశీలించిన తర్వాత వీలైనంత త్వరగా ఆయన ఆరోగ్య సమస్యలు క్లియర్ చేసే ప్రక్రియ మొదలవుతుందని ఆయన స్పష్టం చేశారు. మొత్తానికైతే వీలైనంత త్వరలోనే పంచు ప్రసాద్ కి సర్జరీ జరిగి ఆయన ఆరోగ్యం త్వరగా కుదుటపడాలని కూడా నెటిజెన్లు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: