వీరి దగ్గర నుంచి రూ .60 లక్షలు విలువ చేసి ఎర్రచందనం దుంగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లుగా సమాచారం. పలమనేరు డిఎస్పి సుధాకర్ రెడ్డి తెలిపిన సమాచారం ప్రకారం.. గడిచిన ఆదివారం రాత్రి పుంగనూరు పోలీసులకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు శివారు ప్రాంతంలో తనిఖీలు చేపట్టారని పోలీసులను చూసి రెండు వాహనాలు తప్పించుకునేందుకు పలు ప్రయత్నాలు చేయగా పోలీసులు ఈ విషయాన్ని గమనించి ఆ రెండు వాహనాలను అడ్డగించి పట్టుకున్నారని తెలియజేశారు. ఈ క్రమంలోనే ఒక వాహనం డ్రైవర్ పోలీసుల కన్నుగప్పి పరారు కాగా మరొక వాహనం డ్రైవర్ కిషోర్ పోలీసులకు చిక్కిపోయారు.
ఈ రెండు వాహనాలను తనిఖీలు చేయక అందులో రూ .60 లక్షల రూపాయల విలువచేసే 19 ఏ గ్రేడ్ ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు తెలియజేశారు. ఈ వాహనాలను సైతం సీజ్ చేసినట్లుగా తెలుస్తోంది. అయితే జబర్దస్త్ కమెడియన్ హరి మాత్రం పరారీలో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి పోలీసులు మాత్రం అతని కోసం గాలిస్తున్నట్లుగా సమాచారం. ఇప్పటికే అతనిపైన ఎర్రచందనం అక్రమ రవాన విషయంలో పలు రకాల కేసులు ఉన్నాయని పోలీసులు తెలియజేయడం జరిగింది. హరి అనేక ఇబ్బందులు పడి జబర్దస్త్ లోకి వచ్చి లేడీ గెటప్ లో అలరిస్తూ ఉండేవారు. తనదైన పంచు డైలాగులతో డబుల్ మీనింగ్ డైలాగులతో అలరించిన హరి ఇలా స్మగ్లింగ్ కేసులో ఇరుక్కోవడంతో అందరూ షాక్ అయ్యారు.