టీవీ9 ఆంధ్రప్రదేశ్ లో న్యూట్రల్ గా ఉందనే అభిప్రాయం ఉంది. కానీ తెలంగాణలో మాత్రం ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వార్తలు ఇస్తూ ఉండేదన్న వాదన ఉంది. కానీ మైం హోం రామేశ్వర్ రావు కారణంగా బీజేపీకి కూడా వ్యతిరేకంగా కాకుండా న్యూట్రల్ గా వార్తలు ప్రసారం చేశాయి. అయితే కేంద్రానికి, రాష్ట్రానికి లడాయి ఉందని టీవీ 9 ప్రచారం చేస్తుంది. అయితే ఇక్కడ టీవీ 9 తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మొదటి నుంచి బీజేపీకి, వైసీపీకి ఆంధ్రలో పొత్తు ఏం లేదు.


బీజేపీ నాయకులు జీవీఎల్, సోము వీర్రాజు, దగ్గబాటి పురందరేశ్వరీ లాంటి వారు మొదటి నుంచి వైఎస్ జగన్ ని వైసీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూనే ఉన్నారు కానీ దీన్ని మరిచిన టీవీ 9 ఏదో ఇప్పుడు వారిద్దరి మధ్య వైరం ప్రారంభమైనట్లు వార్తలు ప్రసారం చేస్తుంది. రామతీర్థం రథం కాలి బూడిదైనపుడు, గుడులపై దాడులు జరిగినపుడు వైసీపీ ప్రభుత్వంతో పొట్లాడింది బీజేపీ నాయకులు సోము వీర్రాజు అన్న విషయం టీవీ 9 మరిచిపోయిందా అన్న విమర్శలు వస్తున్నాయి.


చివరకు సోము వీర్రాజు ను అడ్డుకుంది వైసీపీ ప్రభుత్వం. టిప్పు సుల్తాన్ విగ్రహం పెడతామంటే అడ్డుకున్నది కూడా సోము వీర్రాజు అన్న విషయం మరిచిపోయారు. జీవీఎల్ నరసింహ రావు, సోము వీర్రాజు లాంటి వారు ప్రతి సారి వైసీపీపై విమర్శలు చేస్తూనే ఉన్నారు. రాష్ట్ర ప్రజలకు వ్యతిరేకంగా జరుగుతున్న కార్యక్రమాలపై ప్రశ్నించారు.


ఏ రోజు కూడా వైసీపీ ప్రభుత్వానికి మద్దుతుగా మాట్లాడింది లేదు. కానీ టీవీ 9 వార్తలు మాత్రం గతంలో బీజేపీ, వైసీపీ దోస్తులుగా ఉండి ప్రస్తుతం విడిపోయినట్లే ప్రవర్తిస్తున్నాయని టీవీ9 తెగ ప్రచారం చేస్తోందని బీజేపీ నేతలు అంతర్గత సంభాషణల్లో అంటున్నారు. టీవీ 9 చేస్తున్న ప్రచారంలో వీసమెత్తు కూడా నిజం లేకపోలేదని.. ప్రస్తుతం టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి ఆంధ్రలో పోటీ చేయాలని అనుకుంటుంటే వైసీపీతో, బీజేపీ స్నేహం చెదిరిందని టీవీ 9 ప్రచారం చేయడం ఎంత వరకు కరెక్టని వారు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: