ఇక వర్మ దర్శకత్వంలో వచ్చిన ఐస్ క్రీమ్ చిత్రంతో హీరోయిన్గా పాపులారిటీ సంపాదించిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రంలో అతిథి పాత్రలో కనిపించింది. తెలుగులోనే కాకుండా తమిళంలో కూడా పలు చిత్రాలలో నటించింది. తెలుగు బిగ్ బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె బిగ్ బాస్ లో చేసిన రచ్చ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. హౌస్ లో ఉన్నంతకాలం ఈమె గ్లామర్ షో తో తెగ రచ్చ చేసి ఎక్స్పోజింగ్ భారీగానే చేసింది. ఇక సోషల్ మీడియాలో తరచూ ఆక్టివ్ గా ఉంటున్న తేజస్వి మదివాడ తనకు సంబంధించిన ఏ విషయమైనా సరే వైరల్ గా మారుతూ ఉంటుంది.
బిగ్బాస్ తో వచ్చిన పాపులారిటీతో పలు అవకాశాలు అందుకున్నప్పటికీ ఆ తర్వాత సక్సెస్ కాలేక పోయింది. ముఖ్యంగా ఈమె యువతను బాగా అట్రాక్ట్ చేసే విధంగా పలు పాత్రలో నటిస్తూ ఉంటుంది. పొట్టి పొట్టి దుస్తులను వేస్తు హీరోయిన్ల కంటే ఎక్కువగా గ్లామర్ షో చేస్తూ ఉంటుంది తేజస్వి మదివాడ.. బుల్లితెరపై బీబీ జోడీలో బిగ్ బాస్ కంటెస్టెంట్ అఖిల్ తో కలిసి డాన్స్ చేస్తూ మరింత రెచ్చిపోయింది. దీంతో వీరిద్దరు లవ్ లో ఉన్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ అమ్మడు తన క్లోజ్ ఫ్రెండ్ ని త్వరలోనే వివాహం చేసుకోబోతోంది అంటూ సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే నిశ్చితార్థం కూడా అయిపోయిందని వార్తలు వినిపిస్తున్నాయి.త్వరలోనే వివాహం చేసుకోబోతోందని సమాచారం.మరి ఈ విషయంపై తేజస్వి క్లారిటీ ఇస్తుందేమో చూడాలి.