ఇకపోతే ఒక్కొక్క కంటెస్టెంట్ కి కూడా అడిగిన దానికంటే రెట్టింపు స్థాయిలో పారితోషకం ఇస్తూ షోలో ఎలా ఉండాలో అన్న విషయంపై కూడా అవగాహన కల్పిస్తున్నారట. ఇదిలా ఉండగా తాజాగా బిగ్ బాస్ షోలోకి మొదటిసారి ఇండియన్ స్టార్ క్రికెటర్ అడుగుపెట్టబోతున్నారు అంటూ ఇప్పుడొక వార్త హల్చల్ చేస్తోంది. ఒకవేళ ఇదే జరిగితే బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెట్టిన మొదటి క్రికెటర్ గా వేణుగోపాలరావు రికార్డు సృష్టించబోతున్నారు.ఆంధ్ర ప్రదేశ్ కి చెందిన ఈ క్రికెటర్ ను ఇప్పుడు ఈ షో కి తీసుకురావాలని స్టార్ మా గట్టిగా ప్రయత్నాలు చేస్తోందట. అందుకే ఆయన అడిగినంత డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధపడినట్లు సమాచారం.
అంతేకాదు ఆరవ సీజన్లో లాగే ఈసారి కూడా టాప్ ఫైవ్ వరకు ఆయన వెళ్లే లాగా బిగ్బాస్ ఆయనకు మాట ఇచ్చిందని సమాచారం. ఇకపోతే ఆంధ్ర క్రికెటర్ వేణుగోపాలరావు విషయానికి వస్తే.. 2019లో ఆటకు గుడ్ బై చెప్పిన ఇతడు క్రికెట్లోని అన్ని ఫార్మాట్ నుంచి రిటైర్ అవుతున్నట్లు ఆ సమయంలోనే ప్రకటించాడు. 2005 జూలైలో తొలి వన్డే ఆడిన ఆయన కెరియర్లో 10 నెలల వ్యవధిలోనే 16 వన్డేలకు పరిమితమై తన క్రికెట్ జీవితాన్ని ముగించేశారు.