TV: నెలకు రూ.3 కోట్ల సంపాదన.. యాంకర్స్ లో ఆమె హైయెస్ట్..!

Divya
బుల్లితెర యాంకర్ అనగానే ముందుగా మనకు సుమా, అనసూయ, శ్రీముఖి , రష్మీ గౌతమ్, ఝాన్సీ, విష్ణుప్రియ, శ్యామల వంటి వారు గుర్తుకు వస్తారు ముఖ్యంగా ఇలా చాలామంది తెలుగు యాంకర్లు బుల్లితెరపై తమ సత్తా చాటుతున్న విషయం తెలిసిందే. అయితే వీళ్ళ పారితోషకం లెక్కలు కూడా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ ఉంటాయి. ఇకపోతే ఎవరు ఎక్కువ పారితోషకం తీసుకుంటున్నారు అనేది ఇప్పుడు చూద్దాం.
యాంకర్ సుమ:
యాంకర్ సుమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు తెలుగులో ఎంతోమంది యాంకర్లు వచ్చారు. వెళ్లారు. కానీ యాంకర్ సుమా ముందు వీళ్లంతా దిగదుడిపే అని చెప్పాలి. ఇప్పటికి కూడా ఆమె అలాగే కంటిన్యూ అవుతూనే ఉంది. తన వాక్చాతుర్యంతో ఆడియన్స్ ని కట్టి పడేస్తున్న ఈమె ఇండస్ట్రీలో ఎంతమంది యాంకర్లు వచ్చినా తన స్థానాన్ని మాత్రం సుస్థిరం చేసుకుని.. నంబర్ వన్ యాంకర్ గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. ఒక్క సినిమా ఫంక్షన్ చేసిందంటే చాలు అక్షరాల రూ .5లక్షలు ఉండాల్సిందే. ఇక ప్రొడక్షన్ కంపెనీని బట్టి ఆ బడ్జెట్ కూడా మారిపోతూ ఉంటుంది.. పెద్ద సినిమా అయితే రూ.2లక్షలు.. ప్రస్తుతం రూ .10 లక్షల వరకు పారితోషకం తీసుకునే ఈమె ఒక్కొక్క టీవీ షో కి ఒక డే కి లక్ష రూపాయల వరకు పారితోషకం తీసుకుంటుంది.. సినిమా ఇంటర్వ్యూలైతే రూ .5లక్షలు.. ఇక సినిమాలో నటిస్తే రూ.25 లక్షలకు పైగా పారితోషకం అందుకుంటుంది. ఇక ఆడియో ఈవెంట్లు , టీవీ షోలు,  ఇంటర్వ్యూలు అయితే నెలకు రూ .1కోటికి పై మాటే అందుకుంటుందట.
అనసూయ:
గ్లామర్ యాంకర్ గా గుర్తింపు తెచ్చుకున్న అనసూయ సినిమాల్లోకి వచ్చిన తర్వాత తన రెమ్యూనరేషన్ ఒక్కసారిగా రెట్టింపు అయింది. ప్రొడక్షన్ కంపెనీని బట్టి ఈమె రేటు కూడా మారిపోతూ ఉంటుంది. రూ.10 లక్షల నుంచి రూ.25లక్షల వరకు పారితోషకం అందుకునే ఈమె పాత్రల ఎంపిక విషయంలో మాత్రం జాగ్రత్త పడుతోంది.ఇక  టీవీ కార్యక్రమాలకి రూ .2లక్షల వరకు పారితోషకం తీసుకునే ఈమె ఇక రిబ్బన్ కటింగ్ వంటి కార్యక్రమాలకు రూ .5 లక్షల వరకు తీసుకుంటుంది.  ఇక సినిమాల లెక్క వేరే.. అలా దాదాపుగా నెల సంపాదన రూ .3కోట్లకు పై మాటే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: