ప్రస్తుత కాలంలో చాలామంది బుల్లితెర నటీనటులు వెండితెరపై సత్తా చాటే ప్రయత్నం చేస్తున్న విషయం తెలిసిందే . ఇప్పటికే సుడిగాలి సుదీర్ ని మొదలుకొని చాలామంది వెండితెరపై హీరోగా సక్సెస్ పొందే దిశగా అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలోనే జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా మంచి పాపులారిటీ దక్కించుకున్న ఇమ్మానుయేల్ తాజాగా ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్ తో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇదిలా ఉండగా సిరీస్ కి సంబంధించిన ట్రైలర్ ను విడుదల చేసినప్పుడు వాలంటీర్ లను గెలుకుతున్నావు.. ఏదైనా తేడాలు వస్తే నీ అంతు చూస్తారు అంటూ ఆయనకి వార్నింగ్ లు కూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా తాజాగా ఇమ్మానుయేల్ హీరోగా నటించిన ఈ వెబ్ సిరీస్ ఫస్ట్ పార్ట్ వచ్చేసింది.

ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ యూట్యూబ్లో తెగ సందడి చేస్తోంది. జబర్దస్త్ కామెడీ షో తో పాపులర్ అయిన ఇమ్మానుయేల్ ఇలా ప్రేమ వాలంటీర్ అనే వెబ్ సిరీస్ లో హీరోగా నటించడం గొప్ప విషయమని చెప్పాలి. ఈ వెబ్ సిరీస్ కి కథని జబర్దస్త్ బాబు,  ఇమ్మానుయేల్ ఇద్దరూ కలిసి రాశారు. స్క్రీన్ ప్లే , డైరెక్షన్ మాత్రం జబర్దస్త్ బాబు చేయడం గమనార్హం. ఈ వెబ్ సిరీస్ కి సంబంధించిన ఫస్ట్ పార్ట్ ను విడుదల చేయగా భారీగా వ్యూస్ ను సొంతం చేసుకుంటుందని చెప్పాలి.

ఇది చూసిన చాలామంది సూటిగా సుత్తి లేకుండా ప్రేమ వాలంటీర్ వెబ్ సిరీస్ పార్ట్ వన్ ప్రేక్షకులు నచ్చేట్టుగా తీశారు అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దర్శకుడు జబర్దస్త్ బాబు పై ప్రేక్షకులు ప్రశంసల కురిపించడమే కాదు వేణులాగా మంచి డైరెక్టర్ అవడం ఖాయం అంటూ చెబుతున్నారు . ఇక ఇమ్మానుయేలు కూడా వాలంటీర్ శ్రీనుగా చాలా అద్భుతంగా చేశారు అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి . ఏది ఏమైనా హీరోగా ఇమ్మాన్యుయేల్ సక్సెస్ కొట్టాడనే కామెంట్లు వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: