
జీ తెలుగులో ప్రసారమైన కన్యాదానం అనే సీరియల్ తో నిరుపమ్ పరిటాల తో కలిసి మొదటిసారి జ్యోతిరాయ్ నటించగా.. ఆ తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ లో నటిస్తోంది. ఇదిలా ఉండగా గత కొంతకాలంగా టాప్ రేటింగ్ లో దూసుకుపోతోంది గుప్పెడంత మనసు సీరియల్. ఇందుకు కారణం జ్యోతిరాయ్ అలియాస్ జగతి అని చెప్పవచ్చు. తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. ఇకపోతే ఒకవైపు సీరియల్స్ మరొకవైపు వెబ్ సిరీస్ లతో బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటోని షేర్ చేసి త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతానంటూ పోస్ట్ చేసింది.
తాజాగా ఒక యంగ్ డైరెక్టర్ తో రిలేషన్ లో ఉన్న ఈ ముద్దుగుమ్మ అతడితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోకి త్వరలోనే ఒక గుడ్ న్యూస్ ఉంది అంటూ క్యాప్షన్ కూడా రాసుకుంది. దీంతో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ చాలామంది కామెంట్లు వ్యక్తం చేస్తున్నారు. ఇకపోతే వీళ్ళు పెళ్లి చేసుకుని సర్ప్రైజ్ ఇస్తారా..? లేక జ్యోతీ రాయ్ ప్రెగ్నెంట్ అని చెప్పి అందరికీ షాక్ ఇస్తుందా..? అని అందరూ ఎదురు చూస్తున్నారు. ఇకపోతే మరొకసారి ఈ విషయంపై ట్రెండింగ్ లోకి వచ్చింది జ్యోతీరాయ్. మరి జ్యోతీరాయ్ చెప్పబోయే ఆ గుడ్ న్యూస్ ఏంటో తెలియాలి అంటే ఇంకొన్ని రోజులు ఎదురు చూడక తప్పదు.