ఇలా పెళ్లయినప్పటికీ కూడా సుజాత పలు బుల్లితెర కార్యక్రమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా నటిస్తూ ఫుల్ బిజీగా మారిపోయింది. ముఖ్యంగా రాకింగ్ రాకేష్ కూడా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ అటు జబర్దస్త్ కార్యక్రమం మరొక పక్క హీరోగా కూడా సినిమా అవకాశాలను అందుకుంటున్నారు.రాకేష్ తో పరిచయం ఏర్పడక ముందే సుజాత సపరేట్ గా యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే తన ఇంట్లో జరిగే ప్రతి విషయాన్ని కూడా ఈమె అభిమానులతో పంచుకునేది. ఇప్పుడు వివాహం జరిగిన తర్వాత మొదటిసారి శ్రావణమాసం రావడం.. అలాగే ఈమె మొదటిసారి మంగళ గౌరీ వ్రతం జరుపుకున్నట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే మొదటిసారి తన అత్తవారింట్లో మంగళ గౌరీ వ్రతం జరుపుకున్న వీడియోని సుజాత తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేయగా ఆ వీడియో చాలా వైరల్ గా మారుతుంది. ముఖ్యంగా మంగళ గౌరీ వ్రతం యొక్క ప్రాధాన్యత ఏమిటి? ప్రత్యేకించి పెళ్లి కాని వారు, పెళ్లయిన మహిళలు ఎందుకు చేయాలి ?అలా అన్ని విషయాలను కూడా ఆమె తెలియజేశారు. ఇకపోతే మంగళ గౌరీ వ్రతం చేయడం వల్ల పెళ్లి కానీ అమ్మాయిలకు పెళ్ళి అవుతుందని, అలాగే పెళ్లి అయిన అమ్మాయిలకు భర్త క్షేమంగా ఉంటాడని.. అందుకే ఈ వ్రతం చేస్తారని కూడా చెప్పుకొచ్చింది.