జబర్దస్త్ నటుడు పంచ్ ప్రసాద్ గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ఇక ఈ విషయంపై ఆయన సన్నిహితులు నూకరాజు, ఇమ్మాన్యుయేల్ సోషల్ మీడియా ద్వారా ఆర్థిక సహాయం అందించాలంటూ ప్రతి ఒక్కరిని అడిగిన విషయం కూడా తెలిసిందే. అయితే తన భార్య ఆయనకు కిడ్నీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా ఆర్థిక ఇబ్బందుల వల్ల కుదరలేకపోతుందని.. ఎవరైనా దాతలు ఆదుకోవాలని వీరు సోషల్ మీడియా ద్వారా వేడుకున్నారు. ఇకపోతే ఆర్కే రోజా సహాయంతో ఈ విషయం నేరుగా ప్రభుత్వానికి తెలియజేయగా.. స్పందించిన ప్రభుత్వం సీఎం ఫండ్ నిధుల ద్వారా.. ఎట్టకేలకు పంచు ప్రసాద్ కి ఆపరేషన్ పూర్తి చేశారు

తాజాగా ఆయనకు యశోద ఆసుపత్రిలో శస్త్ర చికిత్స జరిగిందని యూట్యూబ్ ద్వారా ఆయన భార్య సునీత వెల్లడించింది. ప్రస్తుతం పంచ్ ప్రసాద్ ఆరోగ్యం నిలకడగా ఉందని.. రెండు కిడ్నీలు పాడైపోవడం వల్ల కొద్దిరోజులుగా డయాలసిస్ చేయించుకుంటూ వచ్చాడు.  కానీ ఆరోగ్యం విషమించడంతో ఆపరేషన్ ద్వారా కిడ్నీల మార్పిడి జరిగితేనే ప్రాణాలు నిలుస్తాయని వైద్యులు చెప్పినప్పటికీ తమ వద్ద అంత డబ్బు లేకపోవడం వల్లే ఆపరేషన్ చేయించలేదని.. కానీ ఏపీ ప్రభుత్వం తమ భర్తకు శస్త్ర చికిత్స జరిపించిందని,  తాము ప్రభుత్వానికి ఎప్పటికీ రుణపడి ఉంటామని ఆమె వెల్లడించారు.

ఇకపోతే పంచ్ ప్రసాద్ కు కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ పూర్తయిందని తెలిపిన ఆయన భార్య.. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది అనేది ఇంకా తెలుపలేదు.. త్వరలోనే ఆయన అందరి ముందుకు వస్తారని.. ఎంతోమంది ఆశీస్సులతోనే తన భర్తకు ఆపరేషన్ జరిగిందని ఆమె తెలిపారు.  ఇకపోతే ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితి అంత మెరుగ్గా లేకపోవడం వల్ల ఆయన ఆపరేషన్ చేయించుకోలేక.. ఇన్ని రోజులు డయాలసిస్ తో నెట్టుకొచ్చారు. చివరికి ఏపీ ప్రభుత్వం సహాయంతో తాజాగా కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ విజయవంతంగా పూర్తయినట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: