తెలుగు సినీ ప్రేక్షకులకు నటి సమీరా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తెలుగులో ఎన్నో సీరియల్స్ లో నటించి ప్రేక్షకులకు బాగా దగ్గరైన ఈమె ఆడపిల్ల అనే సీరియల్ తో బుల్లితెర పైకి ఎంట్రీ ఇచ్చి మొదటి సీరియల్ తోనే మంచి గుర్తింపును సొంతం చేసుకుంది. ఆ తర్వాత అభిషేకం, ఆడపిల్ల, జీవితం , అన్నా చెల్లెలు, భార్యామణి , డాక్టర్ చక్రవర్తి , మూడుముళ్ల బంధం, ముద్దుబిడ్డ, భార్యామణి, ప్రతిబింబం, మంగమ్మగారి మనవరాలు ఇలా అనేక సీరియల్స్ లో నటించి తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈమె తెలుగులోనే కాదు తమిళ్ సీరియల్స్ లో కూడా నటించి మెప్పించింది..

ఇదిలా ఉండగా పెళ్లి చేసుకున్న వెంటనే కొడుకు పుట్టడంతో కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయిస్తున్న ఈమె సీరియల్స్ కి కాస్త బ్రేక్ ఇచ్చిందని చెప్పాలి. అయితే సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్ గా ఉండే ఈమె ఎప్పటికప్పుడు ఫోటోలు షేర్ చేస్తూ అందరిని అలరిస్తూ ఉంటుంది. అంతేకాదు సొంతంగా యూట్యూబ్ ఛానల్ ని కూడా మొదలుపెట్టిన ఈమె తన ప్రతి విషయాన్ని అలాగే తన కొడుకుకు సంబంధించిన విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది .ఇదిలా ఉండగా తాజాగా సమీరా చేసిన పోస్ట్ ఒకటి పలు అనుమానాలకు దారితీస్తోంది. అందులో ఆమె తన పెదవికి రక్తం కారుతూ ఉండగా ఆ ఫోటోని షేర్ చేయడంతో భర్తతో గొడవ పడిందా అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

ఇకపోతే ఆ ఫోటోని ఆమె షేర్ చేస్తూ.. ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎవరిని బాధ పెట్టకూడదు. ప్రతి ఒక్కరి కథకి అవగాహన ఉంటుంది .కేవలం జ్ఞాపకశక్తి కోసం క్లిక్ చేసిన చిత్రం నా ఫీడ్ లో చేరుతుందని ఎప్పుడూ అనుకోలేదు. నేను దీని గురించి మీ ఆలోచనలను తెలుసుకోవాలని అనుకుంటున్నాను. ఇది చూస్తే నేను నా భర్తతో ఎక్కువ గొడవ పడినట్లు కనిపిస్తోంది. భర్తకు, భార్యకు కచ్చితంగా ఏదో ఒక గొడవ జరుగుతుంది. నా భర్తతో చాలా మంచి సమయాన్ని గడిపాను. నేను నా భర్త పెద్దగా గొడవ పడినట్టు ఆ పిక్ లో కనిపిస్తోంది.  కానీ ఇది అర్హాన్ పొరపాటు వల్ల జరిగింది .కానీ మీరు ఈ ఫోటో చూడగానే కచ్చితంగా నా భర్తతో గొడవ వల్లే జరిగి ఉంటుందని అనిపించి ఉండవచ్చు.  మేము గొడవపడతాం కానీ ఒకరికొకరు ప్రేమిస్తామంటూ రాసుకొచ్చింది సమీరా.

మరింత సమాచారం తెలుసుకోండి: