ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో సినిమాల కంటే సీరియల్స్ కే ప్రేక్షకులు అధికంగా ఆదరణను అందిస్తున్న విషయం తెలిసిందే. అలా గుప్పెడంత మనసు సీరియల్లో జగతి మేడం పాత్రలో భారీ పాపులారిటీ దక్కించుకున్న జ్యోతి రాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. స్వతహాగా కన్నడ నటి అయినప్పటికీ కూడా తెలుగులో భారీ పాపులారిటీ దక్కించుకున్న ఈమెకి ఆల్రెడీ పెళ్లయిపోయింది. అయితే తాజాగా గత కొన్ని రోజులుగా ఒక కుర్ర దర్శకుడుతో రిలేషన్ లో ఉన్నట్లు రూమర్లు రాగా.. ఇప్పుడు వాటిపై ఆమె స్వయంగానే క్లారిటీ ఇచ్చింది.

జ్యోతి రాయ్ "బందే బరాటవ కాలా" అనే సీరియల్ ద్వారా నటిగా మారి 20 కి పైగా సీరియల్స్ లో నటించింది. ముఖ్యంగా కన్నడ , తమిళం, తెలుగు, తుళు భాషలో నటించిన ఈమె సీతారామ కళ్యాణ,  దియా వర్ణపాఠల ,99 వంటి చిత్రాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేసి.. ఇప్పుడు ప్రస్తుతం గుప్పెడంత మనసు సీరియల్లో హీరోకి తల్లి పాత్ర పోషిస్తుంది. మరొకవైపు వెబ్ సిరీస్ లో హీరోయిన్గా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. ఇదిలా ఉండగా 20 సంవత్సరాల వయసులోనే పద్మనాభ అనే వ్యక్తితో పెళ్లి చేసుకున్న ఈమె ఒక బాబుకు జన్మనిచ్చింది.  


ఏమైందో తెలియదు కానీ అతడికి దూరంగా ఉంటున్న జ్యోతిరాయ్ గత కొన్ని సంవత్సరాలుగా సుకు పుర్వాజ్ అనే యంగ్ డైరెక్టర్ తో రిలేషన్ లో ఉంది ఇద్దరు సన్నిహితంగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అందరూ వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ కన్ఫర్మ్ అయిపోయారు. ఇక మొన్నటి వరకు రిలేషన్ లో ఉన్న వీరు తాజాగా నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా సుకు పుర్వాజ్ తో క్లోజ్ గా ఉన్న ఫోటోలను షేర్ చేస్తూ క్యాప్షన్ లో ఉంగరం గుర్తుతో పాటు లవ్ బర్డ్స్ ఏమోజీ  కూడా షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ. మొత్తానికైతే రూమర్స్ ని నిజం చేస్తూ క్లారిటీ ఇచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: