ప్రముఖ బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తన వాక్చాతుర్యంతో ఎంతోమందిని అలరించిన ఈమె బుల్లితెరపై గ్లామర్ యాంకర్ గా పేరు దక్కించుకుంది. ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా భారీ పాపులారిటీ సొంతం చేసుకున్న అనసూయ అతి తక్కువ సమయంలోనే అంతకుమించి క్రేజ్ దక్కించుకోవడం గమనార్హం. ఇక జబర్దస్త్ లో చేస్తున్నప్పుడే సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అలా సుకుమార్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వచ్చిన రంగస్థలం సినిమా ఆమె కెరియర్నే మార్చేసింది. అందులో రంగమ్మత్త పాత్ర ఇప్పటికీ అందరికీ గుర్తుండిపోయింది అంటే అందులో ఆమె ఎంతలా నటించిందో అర్థం చేసుకోవచ్చు.
ఇకపోతే అనసూయ ఇప్పుడు వరుసగా పాన్ ఇండియా సినిమాలలో కూడా అవకాశాలు దక్కించుకుంటూ మరింత పాపులారిటీ సొంతం చేసుకుంది. విమానం సినిమా భారీ విజయాన్ని అందుకోగా ఇప్పుడు ఆమె నటించిన పెదకాపు సినిమా కూడా విడుదలకు సిద్ధం కాబోతోంది.మరొకవైపు పుష్ప 2 వంటి పాన్ ఇండియా చిత్రాలలో కూడా నటిస్తోంది ఈ ముద్దుగుమ్మ. ఇదిలా ఉండగా తాజాగా సోషల్ మీడియాలో ఎక్కువగా ఉంటూ ప్రతి విషయాన్ని పంచుకునే ఈమె.. ఈ మధ్య మరి ఎక్కువగా సోషల్ మీడియాలో తన ప్రతి ఫోటోని షేర్ చేస్తోంది. ఈ క్రమంలోనే ఆమె శరీరంపై టాటూలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే.

ప్రస్తుతం అభిమానులతో చిట్ చాట్ నిర్వహించిన ఈమె.. ఈ నేపథ్యంలోనే నెటిజన్స్ అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ లో భాగంగా తన ఒంటిపై ఉన్న ట్యాటుల గురించి నా శరీరం పైన రెండు టాటూలు ఉన్నాయి . మొదటి టాటూని నా ఫస్ట్ ఎంగేజ్మెంట్ యానివర్సరీ, మా ఆయన బర్తడే ఒకేసారి రావడంతో వేయించుకున్నాను. అది నిక్కు మా ఆయన పేరు.. రెండోది కేలన్.. గ్రీకు భాషలో క్యారెక్టర్ బ్యూటీ అని క్లియర్గా వివరించింది ఈ ముద్దుగుమ్మ .

మరింత సమాచారం తెలుసుకోండి: