దీంతో పూజ హో అవునా అర్థమైందంటూ సైలెంట్ అయిపోయింది. అయితే అప్పుడే ఆమె టాటూ వెనుక ఏదో రహస్యం ఉండే ఉంటుంది అంటూ ఆడియన్స్ వెతకడం మొదలుపెట్టారు. నిజంగా ఆ టాటూ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ది .. అతనితో బ్రేకప్ కావడంతో అతని పేరు కనిపించకుండా దాన్ని మరో టాటూ తో కవర్ చేసింది నయని. నయనీ చేతి పైన పెద్ద టాటూ కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆమె చేతి పైన ఉండే రెండు అక్షరాలు ఎస్ జె.. షణ్ముఖ జస్వంత్ అని అప్పట్లో కూడా ఈ వార్త సోషల్ మీడియాలో చర్చ నడిచింది. అంతేకాదు అతనితో బ్రేకప్ అవ్వడం వల్ల ఆ పేరు చెరిపేయడమే కాకుండా వీళ్ళు కలిసి నటించిన సాంగ్స్ కూడా ఆమె డిలీట్ చేశారని వార్తలు వినిపించాయి.
అయితే దీనిపై స్పందించిన నయని ఎస్ జె అంటే షణ్ముఖ జస్వంత్ కాదు అని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ కూడా జేతోనే ప్రారంభం అవుతుంది.. కానీ జస్వంత్ కాదు అంటూనే తన బ్రేకప్ కి కారణాలు, అలాగే పాటలు డిలీట్ చేయాల్సి రావడానికి కారణాలు కూడా చెప్పింది. మొత్తానికి షణ్ముఖ్ జస్వంత్ నయనీపావని బాయ్ ఫ్రెండ్ అంటూ వచ్చిన వార్తల్లో నిజం లేదని తేలిపోయింది.