ఇటీవల తన కొడుకుని కూడా సినిమాలలోకి తీసుకురాబోతున్న ఈమె త్వరలోనే తన కొడుకు నటిస్తున్న సినిమాను విడుదల చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇంకొక వైపు సినిమా ఆడియో ఫంక్షన్లకు, ప్రీ రిలీజ్ ఈవెంట్లకు కూడా సుమ హోస్ట్ గా వ్యవహరిస్తోంది. ఇలా అన్ని రకాలుగా తన హస్తాన్ని వేస్తూ మరింత పాపులారిటీ దక్కించుకున్న ఈమె ఆస్తుల పరంగా కూడా బాగానే కూడబెట్టిందని సమాచారం. ప్రస్తుతం ఒక్కో ఈవెంట్ కి రూ.2.5 నుండి రూ.5 లక్షల వరకు పారితోషకం తీసుకుంటున్న ఈమె బ్రాండ్ అంబాసిడర్ గా పనిచేసేందుకు ఈ మొత్తం కొంచెం ఎక్కువగానే ఉంటుందని చెప్పవచ్చు.
అంతేకాదు ఆమె నెల ఆదాయం రూ.5 నుండి రూ.8 లక్షల వరకు ఉంటుందని సమాచారం. ఇక మొత్తంగా 47 సంవత్సరాల ఈ ముద్దుగుమ్మ రూ.50 కోట్లకు పైగా ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది. ఇక ఇటీవలే జయమ్మ పంచాయతీ అనే సినిమాలో లీడ్రోల్ పోషించిన సుమ అవకాశం వస్తే కీలకపాత్ర పోషించడానికి కూడా సిద్ధం అన్నట్లుగా స్పష్టం చేసింది. ఏది ఏమైనా యాంకర్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టి ఇప్పుడు బహుముఖ ప్రజ్ఞాశాలిగా మరింత పాపులారిటీ దక్కించుకుంది సుమ.