ఏ ఇండస్ట్రీలో నైనా కచ్చితంగా నటీనటుల కెరియర్ పరంగా సక్సెస్ సాధించి ఊహించని స్థాయిలో పాపులారిటీ సంపాదించుకోవడం అంటే అంత సులువైన విషయం కాదు.. ఒకప్పుడు వరుసగా పలు సీరియల్స్ లో నటించి కెరియర్ పరంగా బిజీగా ఉన్న నటి గౌరీ రాజ్ ప్రస్తుతం బుల్లితెరకు దూరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రేమ ఎంత మధురం అనే సీరియల్ ద్వారా ఇందులో నెగటివ్ సెడ్స్ ఉన్న పాత్రలో నటించిన గౌరీ రాజ్ ఊహించని స్థాయిలో పాపులారిటీ అందుకుంది. మళ్లీ అనే సీరియల్ ద్వారా కూడా గౌరీ రాజ్ మంచి కేసును అందుకోవడం జరిగింది.

తాజాగా గౌరీ రాజ్ ఒక ఇంటర్వ్యూ లో పాల్గొంటూ పలు విషయాలను తెలిపింది.. నటిగా సీరియల్స్ లో సినిమాలలో చేయాలని తన కోరిక ఉందని కానీ అకస్మాత్తుగా ఎందుకు మానేశాను మీకు చెప్పాలనుకుంటున్నానని తెలియజేసింది గౌరీ రాజ్.. సీరియల్ లో నటిస్తున్న సమయంలో తను నెల తప్పానని కానీ గర్భవతి అన్న విషయం తనకి అసలు తెలియదని ఆ సమయంలో సీరియల్స్ లో ఫైటింగ్ సన్నివేశాల లో నటించడం జరిగిందట.. దీంతో దాదాపుగా ఒక నెలపాటు తీవ్ర రక్తస్రావం జరిగిందని తెలియజేసింది.
అయితే ఆ సమయంలో ప్రెగ్నెంట్ అని తెలియక కడుపునొప్పి ఒకటే ఉండడంతో షూటింగ్లో పాల్గొనే దాన్ని అంటూ తెలిపింది గౌరీ రాజ్.. అయితే తరచూ నొప్పి ఎక్కువగా రావడంతో హాస్పిటల్ కి వెళ్ళాగా.. లోపల కడుపులో శిశువు బ్లాస్ట్ అయ్యిందని.. అలా ప్రెగ్నెన్సీ పోవడం అనేది రెండోసారి కావడంతో చాలా నరకయాతన అనుభవించానని ఆ డిప్రెషన్ నుంచి బయటపడి పనిపై దృష్టి పెట్టిన సర్జరీల వల్ల ఎక్కువగా నిద్ర లేకపోవడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని తెలిపింది గౌరీ రాజ్. డాక్టర్లు సూచన మేరకే సీరియల్స్ కు దూరంగా ఉండమని సలహా ఇవ్వడంతో అప్పటినుంచి ఎలాంటి వాటికి దూరంగానే ఉన్నానని తెలియజేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: