సాధారణంగా సెలబ్రిటీల సైతం బాగా సంపాదించిన తర్వాత తమకు ఇష్టమైన వాటిని తీసుకోవడం జరుగుతుంది. చాలా మంది కార్సు బైక్స్ వంటివి ఎక్కువగా కొంటూ ఉంటారు. అలాగే మొదట యూట్యూబ్లో ఆ తర్వాత పలు రకాల వెబ్ సిరీస్లలో నటించిన కమెడియన్ వైవా హర్ష కూడా బైక్స్ అంటే చాలా ఇష్టమట.. వైవా హార్ష షార్ట్ ఫిలింలతో మంచి పాపులారిటీ సంపాదించుకున్న అనంతరం అవకాశాలు అందుకోని ప్రస్తుతం పలు సినిమాలలో కమెడియన్ గా నటిస్తూ ఉన్నారు. ఇటీవల సొంతంగా ఒక ఇంటిని కూడా కొన్నట్లు తెలుస్తోంది.

దాని విలువ 7 కోట్ల రూపాయలు ఉన్నట్లు సమాచారం హర్ష కి కాలేజీలో చదివేటప్పుడు నుంచే బైక్స్ అంటే చాలా ఇష్టమట. అప్పుడప్పుడు బైక్ రేసింగ్ లో కూడా పాల్గొనే వాడని సమాచారం.అలా బైక్స్ అంటే చాలా ఇష్టం ఉన్నటువంటి హర్ష కెరియర్లో ఎంతో మంచి సక్సెస్ అయిన తర్వాత తనకు నచ్చిన బైక్స్ అన్నిటిని కొనుగోలు చేసినట్లు సమాచారం. దసరా పండుగ సందర్భంగా తన దగ్గర ఉన్నటువంటి కార్ బైకులను సైతం ప్రత్యేకంగా పూజలు చేసి కొన్ని ఫోటోలు షేర్ చేయడం జరిగిందట.
ఈ ఫోటోలు వైరల్ గా మారడంతో వైవ హర్ష వద్ద ఇన్ని బైక్స్ ఉన్నాయని తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. సుమారుగా 7 డిఫరెంట్ కంపెనీల బైక్స్ స్కూటీలు రెండు కార్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ బైక్స్ అన్నీ కూడా చాలా ఖరీదైనవే అన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దసర పండుగ సందర్భంగా వీటన్నిటికీ ఆయుధ పూజ చేసి ఒక వీడియోని షేర్ చేశారు. ఈయన వద్ద ఉన్నటువంటి బైకులు మొత్తం చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. మరి కొంతమంది వైవా హర్ష దగ్గర ఒక మినీ గ్యారేజ్ లాగే ఉంది అంటూ తెలుపుతున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించి ఈ వీడియో వైరల్ గా మారుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: