
త్వరలోనే ఈ సినిమా థియేటరర్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ప్రసాద్ ల్యాబ్ లో గురువారం ఒక ఈవెంట్ ని నిర్వహించారు. ఇందులో పాల్గొన్న రేఖ హీరోయిన్ల జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను తెలిపింది.. రేఖ మాట్లాడుతూ నేను 35 ఏళ్లుగా నటిస్తూనే ఉన్నాను మొదట్లో హీరోయిన్గా ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టుగా పలు రకాలుగా పాత్రలు చేశాను నేను చేసిన సినిమాలలోని పాత్రల పేర్లు నన్ను పిలుస్తూ ఉండడం చాలా ఆనందంగా ఉంది.. 40 ఏళ్లు దాటిన లేడీ యాక్టర్స్ ని దర్శకులు పక్కన పెట్టేస్తున్నారు.. కానీ నటీమణులకు చాలా మందికి మంచి పాత్రలలో నటించాలని కోరిక ఉంటుందని తెలిపింది నటి రేఖ.
తాను మాత్రం బతికున్నంత వరకు నటిస్తూనే ఉంటానని తెలిపింది..ఒకప్పుడు హీరోయిన్లకు నటించడానికి అవకాశం ఉండేది.. ఇప్పుడు కమర్షియల్ సినిమాలలో హీరోయిన్లకు అసలు ప్రాధాన్యత లేకుండా ఉన్నదని తెలిపింది రేఖ. ప్రస్తుతం సోషల్ మీడియాలో చేసిన ఈ వాక్యాలు వైరల్ గా మారుతున్నాయి. కొంత మంది ఈమెను సపోర్ట్ చేస్తూనే.. మరి కొంతమంది నటీమణులు అవకాశాలు లేక అవకాశాల కోసం చాలా ఎదురుచూస్తున్నారంటూ తెలుపుతున్నారు. మరి ఇమే చేసిన కామెంట్స్ వల్ల ఇక మీదటైనా ఈమె ఆవేదనను అర్థం చేసుకొని ఇలాంటి నటులకు అవకాశం ఇస్తారో చూడాలి మరి.