తెలుగు ఇండస్ట్రీలో స్టార్ సింగర్ గా పెరు సంపాదించుకున్న సింగర్ గీతామాధురి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకొని ఎంతో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. గీతా మాధురి ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ఇటీవల ఏదో ఒక విషయంలో నిరంతరం వార్తలలో నిలుస్తూనే ఉన్నది. మొన్నటి వరకు తన భర్త నుండి విడాకులు తీసుకోబోతోంది అంటూ జోరుగా వార్తలు వినిపించాయి. ఈ విషయంపై సింగర్ గీత మాధురి భర్త నందు కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు తాజాగా మళ్లీ ఇమే పైనా ఒక రూమర్ వినిపిస్తోంది.


ఇటీవలే గీత మాధురి ఒక ఇంటర్వ్యూకి హాజరు కావడంతో పలు విషయాలను తెలియజేయడం జరిగింది. తనకు జూదం ఆడడం చాలా ఇష్టమని క్యాసినో ఆడటంతో మునిగిపోతే ఏది అసలు పట్టించుకోనని తెలియజేసింది.. ఆ ఆటలో చాలా లీనమై పోతానంటూ ఆ గేములు అంతగా ఏముందో తెలియదు కానీ దానికి నేను బాగా అడక్ట్ అయ్యాను అని తెలిపింది. అందులో బ్లాక్ జాక్ అనే ఆట మరింత ఇష్టపడతారని తెలుపుతోంది గీతామాధురి. ఈ ఆటలు పూర్తిగా వదిలేద్దామని నిర్ణయించుకున్నాను కానీ తన తల్లిదండ్రులకు క్యాష్ యు గేమ్ ఎలా ఉంటుందో చూపించి మళ్లీ దాని వైపు వెళ్లకూడదని ఒట్టు వేసుకున్నానని తెలిపింది.


అలాగే గీతామాధురి ఆస్ట్రేలియాలో జూదమాడి 3 లక్షల పోగొట్టుకున్నారనే  టాక్ వినిపించింది ఇందులో ఎంత నిజం ఉందని అడగగా.. గీతా మాధురి ఈ విషయంపై కాస్త సిగ్గుపడుతూ ఈ విషయాలు గురించి ఇప్పుడు ఎందుకు మాట్లాడుకోవాలి వదిలేయండి అంతకంటే ఎక్కువే పోగొట్టుకున్నారని తెలియజేసింది.. దీంతో పలువురు నేటిజన్స్ సైతం డబ్బు ఉందని ఎన్ని లక్షలని విలువ చేయకుండా పోగొట్టుకోవడం మంచిది కాదు.. తన భర్త నందు కూడా ఇలా ఫ్రీడం ఇవ్వడం వల్లే ఇమే  ఇ లా తయారయ్యింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ విషయం హాట్ టాపిక్ గా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: