
యాక్టర్ నిరూపమ్ పరిటాల ఎవరో కాదు దివంగత నటుడు రచయిత ఓంకార్ కుమారుడు అనే విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు అయితే తన గుర్తింపుతో బుల్లితెర పైన మంచి నటుడుగా పేరు సంపాదించుకున్న ఈ నటుడు చంద్రముఖి సీరియల్ నుంచి యాక్టింగ్ చేసిన చివరికి కార్తీకదీపం సీరియల్ ద్వారా పాపులారిటీ అందుకున్నారు. తాజాగా రాధాకు నీవే రా ప్రాణం వంటి సీరియల్స్ లో మరింత గుర్తింపుని అందుకున్నారు. యాక్టర్ నిరూపమ్ కు ఎక్కువగా మహిళా ప్రేక్షకుల ఫ్యాన్ ఫాలోయింగ్ భారీగానే ఉందని చెప్పవచ్చు. ఇటీవలే వైజయంతి బ్యానర్ పైన కుమారి శ్రీమతి అనే వెబ్ సిరీస్ లో నిత్యమీనన్ కి జోడిగా నటించడం జరిగింది.
ఈ వెబ్ సిరీస్ పరవాలేదు అనిపించకున్న నటనతో మరింత ఆకట్టుకునే విధంగా పాపులారిటీ సంపాదించుకున్నారు నిరూపమ్.. తాజాగా వెండితెర పైన ఎందుకు నటించలేదని ప్రశ్న ఎదురుగా అందుకు నిరూపమ్ మాట్లాడుతూ.. వరుస పెట్టి సీరియల్ చేస్తున్న సమయంలో రెండు మూడు సినిమాలలో ఆడిషన్స్ కి వెళ్ళాను ఆడిషన్స్ బాగానే ఉన్న టీవీ సీరియల్ చేస్తున్నాను అనే కారణంగా రిజెక్ట్ చేశారని తెలిపారు. ఆ సమయంలో చాలా ఏడుపు వచ్చిందని తన తండ్రి ఫోటో ముందు ఎన్నోసార్లు ఏడ్చానని తెలిపారు నిరూపమ్. తనకు బ్యాగ్రౌండ్ సరిగ్గా లేకపోవడం వల్లే అవకాశాలు ఎక్కువగా రాలేదని ఆవేదనని వ్యక్తం చేస్తున్నారు. కానీ టెలివిజన్ రంగంలో తనకి చాలా సంతోషంగా పనిచేస్తున్నానని తెలిపారు.