సరికొత్త కంటేట్ తో ప్రేక్షకులను ఎప్పుడూ ఆకట్టుకుంటూ ఉంటుంది ప్రముఖ ఓటీటి సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్. ఇప్పుడు తాజాగా మరొక ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది అదే వధువు.. ఇందులో ఆవికాగో నందు ఆలిరేజా కీలకమైన పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఈ వెబ్ సిరీస్ ఎస్ వి బ్యానర్ పైన తెరకెక్కిస్తూ ఉన్నారు. పోలూరు కృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉన్నారు. ఈ వధువు అనే వెబ్ సిరీస్ డిసెంబర్ 8వ తేదీ నుంచి ట్రిమ్మింగ్ కాబోతోంది ఈరోజు ఈ వెబ్ సిరీస్ కు సంబంధించి ట్రైలర్ కూడా విడుదల చేశారు.

ప్రస్తుతం వధువు అనే వెబ్ సిరీస్ ట్రైలర్ విషయానికి వస్తే 1000 ఆపద్దాలాడైన ఒక వివాహాన్ని చేయాలనుకుంటారు.. కానీ ఈ పెళ్లిలో అన్నీ కూడా రహస్యాలే ఉన్నాయంటూ పెళ్లికూతురు ఇందు చెప్పే డైలాగ్ తో ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆనంద్ ని వివాహం చేసుకొని అత్తారింట్లోకి వెళ్లిన తర్వాత పలు రకాల హత్యలు కూడా జరుగుతూ ఉంటాయి ఇవన్నీ అనుకోకుండా జరిగినవి కావని ఎవరు కావాలని చేస్తూ ఉన్నట్లుగా అవికాగోర్ గమనిస్తూ ఉంటుంది.

ఇక ఆ తర్వాత నుంచి ట్విస్టులతో  ఈ వెబ్ సిరీస్ ముందుకు సాగుతోంది. అయితే ఇందులో మిస్టరీలు కూడా ఉన్నట్టుగా కనిపిస్తోంది. ఆవికాగోర్ అత్తవారింటి లో ఉన్న వారి ప్రవర్తన వెనుక కారణాలను వెతికే పనులు ఈమెకు ఎదురైన కొన్ని ఇబ్బందులు అనేక కథాంశంతో ఈ వెబ్ సిరీస్ ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. మొత్తానికి ఆసక్తికరంగా వధువు ట్రైలర్ అందరినీ ఆకట్టుకునేలా కనిపిస్తోంది. ఇందులో చాలామంది సెలబ్రిటీలు కూడా కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా వరుసగా సక్సెస్ లు లేక ఇబ్బంది పడుతున్న ఆవికా గోర్ కు ఈ వధువు వెబ్ సిరీస్ అయిన మంచి విజయాన్ని అందుకుంటుందేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: