
ఇలా ఎన్నో సందర్భాలలో స్టేజ్ పైన శ్రీదేవి డ్రామా కంపెనీ షోల పైన సరే తన వివాహానికి గురించి ప్రేమ గురించి పలు రకాల కామెంట్స్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఎంతో మంది ఈ కమెడియన్ పైన సెటైర్లు వేసిన అవన్నీ కూడా పాజిటివ్ కానీ తీసుకుంటూ ఉంటారు. అయితే ఇప్పుడు తాజాగా అభిమానులకు సడన్ సర్ప్రైజ్ ఇస్తూ తనకు కూడా ఒక లవర్ ఉందంటూ తెలియజేస్తూ అందరిని ఆశ్చర్యపరిచారు. త్వరలోనే మేము ఇద్దరం వివాహం చేసుకోబోతున్నాం అంటూ స్టేజి మీద తెలియజేయడంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.
ఇన్ని రోజులు దాచిపెట్టిన ఒక పెద్ద సీక్రెట్ ని తాజాగా తెలియజేస్తున్నాను అంటూ శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో తన ప్రియురాలిని పరిచయం చేశారు. నరేష్ గురించి ఆమె మాట్లాడుతూ నరేష్ తన మీద చూపించే ప్రేమ కేర్నేస్ అతను అంటే ప్రేమించేలా చేసిందని దాదాపుగా రెండేళ్ల నుంచి ప్రేమించుకుంటున్నామని తెలియజేశారు. అంతేకాకుండా నరేష్ మరొకసారి ఆమెకు స్టేజ్ పైన గులాబీ పువ్వు ఇస్తూ ప్రపోజ్ చేయడం జరిగింది. స్టేజి మీదే నరేష్ తండ్రి కూడా రావడంతో వీరి ప్రేమ మీకు అంగీకారమేనా అని అడగగా తన తండ్రి కూడా అంగీకరించడంతో వీరిద్దరూ స్టేజ్ మీద ఆశీర్వాదం తీసుకున్నట్టుగా చూపించారు. మరి ఇదంతా నిజమో కాదో తెలియాలి అంటే ఫుల్ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.