హైపర్ ఆది ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన రెమ్యూనరేషన్తోపాటు ఎడ్యుకేషన్ గురించి కూడా తెలియజేశారు.. హైపర్ ఆది తను ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ నని టెన్త్లో 545 ఇంటర్లో 950 బీటెక్లో 85% మార్కులు వచ్చాయని తెలిపారు.. ఈ మార్క్ లిస్ట్ తీసుకొని దాసరి నారాయణరావు గారి ఇంటికి అవకాశాల కోసం ఇవ్వమని అడగగా ఆయన తన సర్టిఫికెట్లు చూసి ఇంత చదువు చదివావు నువ్వు ఆర్టిస్ట్ ఏంటయ్యా ఏదైనా ఉద్యోగం చూసుకో అంటూ తెలిపారట. అయితే ఈ విషయం తనకు తెలియక చెప్పులు అరిగేలా తిరిగానని తెలిపారు. అయితే సక్సెస్ అయిన తర్వాత దాసరి నారాయణ గారిని కలుద్దాం అనుకుంటే అది కుదరలేదని తెలిపారు.
హైపర్ ఆది అసలు పేరు ఆదయ్య ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత హైపర్ ఆది గా మార్చుకున్నారట. ఎన్నో చిత్రాలలో నటించిన తన పేరు మాత్రం మారలేదని తెలియజేశారు.. దాదాపుగా 11 ఏళ్లుగా జబర్దస్త్ చేశాను ప్రస్తుతం జబర్దస్త్ మానేశా శ్రీదేవి డ్రామా కంపెనీ ఢీ షోలు మాత్రమే చేస్తున్నానని తెలిపారు.. సినిమాలు చేస్తుండడంతో జబర్దస్త్ మానేశానని తెలిపారు. జబర్దస్త్ లో చేయాలి అంటే మైండ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. స్క్రిప్టు రాయాలి ప్రాక్టీస్ చేయించాలి అందుకోసం నాలుగు రోజులు కేటాయించాలి అందుకే చాలా కష్టమని తెలియజేశారు. అయితే స్కిట్లకు వచ్చే వ్యూస్ ను బట్టి పేమెంట్స్ ఉంటుందని దాన్నిబట్టి డిమాండ్ కూడా చేయవచ్చని తెలిపారు హైపర్ ఆది. బయట ఈవెంట్స్ కూడా చేస్తానని.. ఎప్పటికీ మల్లెమాలవారికి రుణపడి ఉంటానని తెలియజేశారు. మల్లెమాల లో పనిచేయడం అంటే మాకు గవర్నమెంట్ జాబ్ కిందే లెక్క అంటూ తెలిపారు హైపర్ ఆది..