పెద్ద ఎత్తున జిమ్ వర్క్ అవుట్ చేస్తూ కుర్రకారులకు చమటలు పట్టించే విధంగా చేస్తూ ఉంటుంది. ప్రగతి నాలుగుపదుల వయసులో కూడా ఇంతే చలాకీగా ఉంటూ ప్రేక్షకులను అదరగొట్టిన ప్రగతి.. ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తను చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలా చేస్తోంది.తనని ఒక వ్యక్తి చిన్న వయసులోనే అమ్మని చేశారంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.. సినిమాలపై ఆసక్తితో తన ఇండస్ట్రీలోకి రావాలనుకున్నాను..
మొదట హీరోయిన్గా అడుగు పెట్టాలని భావించగా ఒక వ్యక్తితో తనతో మాట్లాడి తన ఆలోచనలను సైతం చెడగొట్టారని సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా అవకాశాలు రావడం కష్టమే అని అలాగే వచ్చిన అవకాశాలు ఎక్కువ కాలం తనని హీరోయిన్గా కొనసాగించలేవని తల్లి పాత్రలు చేస్తే ఎక్కువకాలం కొనసాగించవచ్చు అంటూ సలహా ఇచ్చారట. ఇలా తనకు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం కొనసాగాలన్న కారణంతోనే చిన్న వయసులోనే తల్లి పాత్రలలో నటించాను అంటూ తెలియజేసింది. ప్రస్తుతం ప్రగతి చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి. మొదట్లో తమిళ సినిమాలలో హీరోయిన్గా నటించిన ఆ తర్వాత పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఇప్పుడు అడపా దడపా సినిమాలలో నటిస్తోంది.