తెలుగు సినీ ఇండస్ట్రీలో మొదట హీరోగా ఆ తర్వాత విలన్గా కొన్ని సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు నటుడు శివాజీ..అయితే గడిచిన కొన్ని సంవత్సరాల తర్వాత మళ్లీ బుల్లితెర పైన బిగ్ బాస్-7 లో పాల్గొని మంచి పాపులారిటీ సంపాదించారు హౌస్ లో రెండు వారాలు ఉంటే ఎక్కువ అనుకున్న శివాజీ చివరికి ఫినాలే వరకు చేరుకున్నారు. టైటిల్ రేసులో నిలిచిన పల్లవి ప్రశాంత్ అమరదీపులకు గట్టి పోటీ కూడా ఇచ్చారు టాప్ త్రీ లో స్థానాన్ని దక్కించుకున్న శివాజీ అప్పటినుంచి మంచి క్రేజీ ను అందుకున్నారు.


అలా పలు సినిమాలలో కూడా అవకాశాలు అందుకుంటూనే వెబ్ సిరీస్లలో కూడా నటిస్తూ ఉన్నారు. అయితే బిగ్ బాస్ లో పల్లవి ప్రశాంత్ విజయానికి యావర్ ఫినాలే వరకు రావడానికి ముఖ్య కారణం శివాజీ వెనుక నుండి నడిపించడమే అంటూ ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. తరచూ ఈ మధ్యకాలంలో పలు రకాల ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఉన్న శివాజీ తాజాగా తన ఆస్తుల గురించి మరొకసారి అసలు విషయాన్ని బయటపెట్టారు.. ఒకప్పుడు ప్రధాన నగరాలలో కొన్ని ఎకరాల భూములు వ్యాపారాలు ఉండేవని అప్పట్లో తాను చేసిన ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు కనుక ఉండి ఉంటే ఇండస్ట్రీలో తరలిమించిన ధనవంతుడు ఉండేవారు కాదన్న విషయం పైన శివాజీ షాకింగ్ విషయాలను తెలిపారు.


అయితే ఒక సినిమా కోసం అత్యంత విలువైన 14 ఎకరాల భూమిని కూడా అమ్మేశారని శివాజీ తెలిపారు. తన సొంత ఊరిలో ఉన్న పొలం శాశ్వతంగా ఉంటే చాలనుకున్నాను అందుకే మిగిలిన చోట్ల ఆస్తులు అన్నిటిని కూడా అమ్మేశానని తెలిపారు.. తాను చేసిన రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ల వల్లే సినిమా అవకాశాలు లేకపోయినా పదేళ్లపాటు జీవించగలుగుతున్నానని తెలిపారు.. తనని సినిమానే బతికించింది సినిమానే కాపాడింది వ్యాపారాలు మాత్రమే అని తెలిపారు.. తాను ఎటువంటి రాజకీయ పార్టీ దగ్గర చేయించాల్సి అడగలేదని ఆ విషయాన్ని నిరూపిస్తే ఆ క్షణమే తాను చచ్చిపోతానని సంచలన వ్యాఖ్యలు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: