గడిచిన కొన్ని నెలల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ చేస్తూ ధనరాజు మాట్లాడుతూ జబర్దస్త్ షో కి గుడ్ బై చెప్పడం చాలా తప్పు చేశామని నేను వేణు చాలా సార్లు అనుకునేవాళ్లంటూ ధనరాజు తెలిపారు.. గతంలో ఒకసారి మాటీవీలో ఆలీ టాకీస్ అనే ప్రోగ్రామ్ వచ్చేదని అషో ఆలీ గారు కొన్ని కారణాల వల్ల దూరం కాగా.. ఆషోని మా టాకీస్ గా మార్చేశారని.. ఆ సమయంలో వేణు వచ్చి నువ్వు నేను యాంకర్ అని చెప్పి తనని ఆ షోకి ఒప్పించారని ధనరాజ్ తెలిపారు.
జబర్దస్త్ అనేది కామెడీ స్కిట్ అని మా టాకీస్ అనేది యాంకరింగ్ షో కి సంబంధించింది..ఈ రెండు వేరు వేరు కాబట్టి సమస్య ఉండదు అనుకున్నానని తెలిపారు. కానీ ఆ సమయంలో జబర్దస్త్ దీప్తి గారితో మాట్లాడడం వల్ల ఆవిడ మీరు ఇక్కడ కనిపించిన అక్కడ కనిపించిన మీకు ఉండే క్రేజ్ పోతుందని తెలిపారట.. అయితే మాటీవీలో మా టాకిషో అయిపోయిన తర్వాత జబర్దస్త్ రావాలని దీప్తి గారు తనని సూచించారని తెలిపారు.. కానీ అక్కడికి వెళ్లాలంటే టీమ్ లీడర్ గా పనిచేసిన వారు మళ్ళీ కంటిస్టెంట్లుగా చేయాల్సి ఉంటుంది. అందువల్లే సమస్యలు వస్తాయని భావించి జబర్దస్త్ కి దూరమయ్యానని తెలిపారు.. ఇటీవల ధనరాజు డైరెక్టర్ గా కూడా పలు సినిమాలను తెరకెక్కిస్తున్నారు.