
అందుకు సంబంధించిన ఫోటోలను కూడా ఇటీవలే షేర్ చేసింది ఈ పూజల వల్ల ఈమెకు ఏదైనా లక్ కలిసి వచ్చిందా లేదా తెలియదు కానీ ఇప్పుడు ఈమె బాటలోనే మరొక నటి అషు రెడ్డి కూడా తన ఇంట్లో వేణు స్వామితో ప్రత్యేకమైన పూజలు చేయించుకుంది. అందుకు సంబంధించి ఒక వీడియో కూడా సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ వీడియో చూస్తూ ఉంటే బగ్లాముఖిదేవి, రాజేష్ శ్యామల దేవి పూజలను ఈ ముద్దుగుమ్మ చేయించినట్టుగా కనిపిస్తోంది.
పూజ అనంతరం వేణు స్వామి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం కూడా తీసుకుంటోంది. ఈ వీడియోకి పూజ టైం డివైన్ టైం అంటూ హ్యాష్ ట్యాగ్ పెట్టింది.. అలాగే ఎవరి నమ్మకాలు వాళ్ళవి బ్రో అంటూ మరొక విషయాన్ని ట్యాగ్ చేస్తూ జత చేయడం జరిగింది. వేణు స్వామితో ఆషు రెడ్డి పూజలు చేయించడం ఇదేమి మొదటిసారి కాదు గతంలో కూడా కారు కొన్నప్పుడు కూడా ఇలాంటి పనే చేసింది.ఇప్పుడు మళ్ళీ పూజలు చేయడం హార్ట్ టాపిక్ గా మారడంతో అభిమానులు సైతం హీరోయిన్ గా అషు రెడ్డి ట్రై చేస్తోంది. కనుక సక్సెస్ కావాలని ఇలా చేసిందేమో అన్నట్లుగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఇలా అయినా ఈ ముద్దుగుమ్మకు కలిసి వస్తుందేమో చూడాలి