బిగ్ బాస్ -7 లో కంటిస్టెంట్ గా పాల్గొన్న బోల్డ్ బ్యూటీగా ఎంట్రీ ఇచ్చిన కిరణ్ రాథోడ్ మొదటి వారంలోని ఎలిమినేట్ అయింది.. దీంతో బిగ్ బాస్ లో ఈమెకు పెద్దగా పేరు రాలేదు. 2001లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టిన కిరణ్ రాథోడ్ నువ్వు లేక నేను లేను ,జెమిని ,భాగ్యలక్ష్మి బంపర్ డ్రా వంటి చిత్రాలలో నటించింది.. బోల్డ్ పాత్రల్లో కనిపిస్తూ తనదైన స్టైల్ లో ముద్ర వేసుకుంది ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్ నటి రవీనా టాండన్ కి కజిన్ అవుతుంది. మరో బోల్డ్ బ్యూటీ షకీలా పోస్ట్ గా చేసిన చాట్ షోలో పాల్గొనింది.

షకీలా తన జీవితంలో జరిగిన సంఘటనలను సినీ పరిశ్రమలో ఎదురైన చేదు అనుభవాలను కూడా తెలిపింది.. సినిమా అవకాశాలు తగ్గడంతో కిరణ్ రాథోడ్ ఒక యాప్ను కూడా ప్రారంభించిందట.. ఈ యాప్ లో తన హాట్ వీడియోలు ఫోటోలను కూడా పోస్టులు చేస్తున్నానని తెలిపింది. దర్శక నిర్మాతలు ఆ వీడియోలు చూసి తనకు అవకాశాలు ఇస్తారేమో అనుకున్నానని కానీ ఎవరూ కూడా తనకి అవకాశం ఇవ్వలేదని.. డబ్బులిస్తం మరి కమిట్మెంట్ ఇస్తారా అంటూ చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నారని తెలిపింది..


దీంతో ఆ యాప్ ని సైతం నిలిపివేసినట్టుగా తెలియజేసింది కిరణ్ రాథోడ్.. అయితే ఇప్పుడు instagram లో అలాంటి వీడియోలు పోస్టులు చేస్తున్నారని అవకాశాల కోసమే ఇలా చేస్తున్నాను కానీ వాటిపైన కూడా నెగటివ్ కామెంట్స్ చేస్తున్నారంటూ తెలిపింది.. అలాంటి ఫోటోలు వీడియోలకు కమిట్మెంట్ ఇస్తున్నానని ఇలా హింటు ఇస్తున్నావా అంటు చాలా దారుణంగా కామెంట్స్ చేస్తున్నారని తెలిపింది.. తాను ఎలాంటి శృంగార చిత్రాలలో కూడా నటించలేదని కానీ తన పైన ఆ విధంగా ముద్రవేశారంటు వెల్లడించింది. హాట్ వీడియోలు చాలామంది చేస్తున్నారు కానీ తన పైన ఎందుకు ఇలా విమర్శలు చేస్తున్నారో అర్థం కావడం లేదంటూ తెలిపింది. గతంలో ఒక వ్యక్తిని ప్రేమించి నాలుగేళ్లు రిలేషన్ లో ఉన్న కానీ అతడు మంచివాడు కాదని తెలిసి చాలా కృంగిపోయాను ఆ సమయంలో ఎన్నో సినిమా ఆఫర్స్ వచ్చాయని కానీ అవన్నీ వదులుకున్నానని తెలిపింది కిరణ్ రాథోడ్. ఈ విషయాలన్నీ షకీలాకే చెబుతూ ఆవేదన వ్యక్తం చేసింది కిరణ్ రాథోడ్.

మరింత సమాచారం తెలుసుకోండి: