
ఈ మేరకు దివి మాట్లాడుతూ తనని మొహం మీద తిరస్కరించిన సందర్భాలు కూడా ఉన్నాయి.. ముఖ్యంగా తాను సన్నగా ఉన్నానని ఒకరు రిజెక్ట్ చేస్తే మరొకరు లావుగా ఉన్నానని రిజెక్ట్ చేశారు.. ఒకసారి సన్నగా మారమని మరొకసారి లావుగా మారమంటారు వీటికంటే ఘోరం ఏమిటంటే రీసెంట్గా ఒక చిత్రంలో నేను సెలెక్ట్ అయ్యాను.. అది కూడా రవితేజ లాంటి హీరో పక్కన లీడ్ క్యారెక్టర్ ఇంకో ఐదు రోజులలో షూటింగ్ మొదలవుతుందని రాత్రికి రాత్రి తనని తీసేశారంటే ఇలాంటి చేదు అనుభవాలను బయటపెట్టింది దివి..
ఎన్నో ఆఫీసుల చుట్టూ తిరిగాను ఒక దశలో తనపై తనకే నమ్మకం కూడా పోయింది అంటూ వెల్లడిస్తోంది. అవకాశాల కోసం ఎన్నో ఆడిషన్స్ ఇచ్చాను చాలా మంది రిజెక్ట్ చేశారు మరి కొంతమంది ఫోన్ చేస్తామంటారు ఇంటికి వెళ్లిన తర్వాత అసలు పట్టించుకోరని.. బాత్రూంలో షవర్ ఆన్ చేసుకొని నోరు మూసుకొని ఎన్నోసార్లు ఏడ్చేదాన్ని అంటూ.. తన జీవితంలో కూడా ఎన్నో రాత్రులు ఏడుస్తూ చీకటి రాత్రులుగానే మిగిలాయని తెలుపుతోంది దివి.. ఈ విషయాలు తన తల్లిదండ్రులకు తెలిస్తే ఇబ్బంది పడతారని తిడతారని చెప్పేదాన్ని కాదంటూ వెల్లడిస్తోంది దివి.. అయితే సోషల్ మీడియాలో భారీగానే ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. మరి రాబోయే రోజుల్లో స్టార్ హీరోల చిత్రాలు నటించే అవకాశాలు వెలుపడతాయేమో చూడాలి.