
ఇలాంటి సందర్భాలలో స్టార్స్ సైతం కాళ్లు చేతులు విరుగొట్టుకుంటూ కూడా ఉంటారు. మరి కొంతమంది చావు అంచుల వరకు వెళ్లి తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలాంటి ఒక సంఘటన నటి రాజ్యలక్ష్మి కెరియర్లో జరిగిందట.. దాదాపుగా అన్ని భాషలలో కలుపుకొని ఇప్పటివరకు 100కు పైగా చిత్రాలలో నటించింది రాజ్యలక్ష్మి ముఖ్యంగా ఈమె ఇవి సత్యనారాయణ డైరెక్షన్ లో వచ్చిన చెవిలో పువ్వు అనే సినిమాలో నటిస్తున్న సమయంలో ఈమె చావు అంచుల నుంచి బయటపడిందట.
ఒక మండపంలో ఆమె ఉరి వేసుకొని చనిపోయే సన్నివేశం చిత్రీకిస్తున్న సమయంలో అది నాచురల్ గా రావడం కోసం నిజంగానే ఆమెకు ఒక తాడు కట్టి లాంగ్ షాట్ లో షూటింగ్ చేస్తున్నారట. అయితే సమయంలో ఊరి బిగించుకోవడంతో ఆమెకు సహాయం చేయడానికి కూడా ఎవరిని కనిపించకుండా దూరంగా పెట్టారట.కానీ ఆమెకు పడ్డ ఊరిని మర్చిపోవడంతో కెమెరా తీస్తున్న వ్యక్తులు ఉన్నప్పటికీ గమనించలేకపోయారట. చివరి క్షణాలలో ఆమె కళ్ళు తేలేస్తున్న సమయాన్ని గమనించే సరికి దాదాపుగా చావు అంచుల చివరి వరకు వెళ్లిందట.. ఆ తరువాత వెంటనే చిత్ర బృందం అలర్ట్ అయి ఆ తాడును తప్పించి ఆమెను మేలుకొలిపి తిరిగి మళ్ళీ అదే షార్టును పూర్తి చేశారట. అలా రాజ్యలక్ష్మి చావు అంచులకు వెళ్లి తప్పించుకుంది.