
అలా లేడీ గెటప్పులో ఆకట్టుకున్న వారిలో జబర్దస్త్ మోహన్ కూడా ఒకరు.. మోహన్ ఎక్కువగా లేడీ గెటప్పులలో కనిపిస్తూ ఎన్నో రకాల స్కిట్లను కూడా చేశారు.. ఇటీవలే జబర్దస్త్ మోహన్ ఎట్టకేలకు ఒక ఇంటి వారయ్యారు.. జబర్దస్త్ మోహన్ వివాహ వేడుకకు ఎంతో మంది కమెడియన్స్ కూడా హాజరయ్యారు.. అదిరే అభి, రాకెట్ రాఘవ, అప్పారావు, గడ్డం నవీన్ తదితర కమెడియన్లు కూడా అక్కడికి హాజరయ్యారు.. మోహన్ పెళ్లికి సంబంధించి ఫోటోలు అన్నీ కూడా నవీన్ తన ఇంస్టాగ్రామ్ లో షేర్ చేయడం జరిగింది.
జబర్దస్త్ మోహన్ జబర్దస్త్ స్టేజ్ పైన వేసేటువంటి లేడీ గెటప్పులు చాలా ఆకట్టుకుంటూ ఉంటాయి.. ముఖ్యంగా ఈయనను చూస్తే అచ్చం లేడీ లాగే బాడీ లాంగ్వేజ్ ను కూడా మైంటైన్ చేస్తూ ఉంటారు.. రాకెట్ రాఘవ భార్యగా ఎన్నో స్కిట్లలో కూడా కనిపించారు మోహన్.. అయితే జబర్దస్త్ మోహన్ పెళ్లి చేసుకున్న అమ్మాయి గురించి ఇంకా ఎలాంటి సమాచారాలు అయితే తెలియలేదు కానీ.. వీరిది ప్రేమ వివాహమా లేక పెద్దలు కుదిర్చిన వివాహమా అన్న విషయం తెలియాల్సి ఉంది. దీంతో పలువురు అభిమానుల సైతం జబర్దస్త్ మోహన్ కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ప్రస్తుతం వెండితెర బుల్లితెర సెలబ్రిటీలు ఒక్కొక్కరిగా వైవాహిక బంధం లోకి అడుగుపెడుతుండగా.. ఇప్పుడు మోహన్ కూడా పెళ్లి చేసుకుని ఒక ఇంటి వారు అయ్యారు అని చెప్పవచ్చు.