ఎంతో మంది హీరోయిన్స్ సైతం వివాహమైన తర్వాత సినిమాలకు కాస్త దూరంగా ఉంటారు. ముఖ్యంగా అవకాశాలు రాకపోవడంతో పలు సినిమాలలో కీలకమైన పాత్రలు తల్లిగా, అమ్మగా ఇతరత్రాల క్యారెక్టర్లలో నటిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పబోయే హీరోయిన్ కి ఏకంగా ముగ్గురు పిల్లలు తల్లి అంటే ఎవరు నమ్మలేరు. అప్పటికి ఇప్పటికీ అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ వస్తోంది. 17 ఏళ్ల వయసులోనే మోడల్ మీద తన కెరీయర్ని మొదలుపెట్టి 20006లో ఇండస్ట్రీలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. ఆమె పేరు ఏదో కాదు హీరోయిన్ విజే మహి వినోద్..


ఇమే తెలుగు, మలయాళం, కన్నడ వంటి భాషలలో కూడా నటించింది.. చాలా మంది సైతం సీరియల్స్ నుంచి సినిమాలలోకి వెళ్తూ ఉంటే కానీ ఈ నటి జర్నీ మాత్రం అందుకు భిన్నంగా సాగుతోంది. 2004లో తపన అనే తెలుగు చిత్రం ద్వారా హీరోయిన్గా నటించిన అదే ఏడాది అపరిచితన్ అనే ఒక మలయాళం సినిమాలో కూడా నటించింది.. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడంతో అవకాశాల కోసం ఎదురుచూసి సీరియల్ వైపుకు అడుగులు వేసింది..


దీంతో 2008లో కన్నడలో ఒక సినిమాలో నటించి పూర్తిగా బుల్లితెరకే సెటిలైపోయింది.. రియాలిటీ షోలు డాన్సులు చేసుకుంటూ ఉన్న విజే మహి వినోద్ 2020 తర్వాత మరో షోలో కూడా ఎక్కడ కనిపించలేదు.. పర్సనల్ విషయానికి వస్తే 2011లొ హీరోయిన్ మహి నటుడు జై భానుషాలిని వివాహం చేసుకుంది. వీరికి తారా అని కూతురు కూడా ఉన్నది.. అలాగే రాజువిర్ ఖుషి అని ఇద్దరు పిల్లలను విజే మహి వినోద్ పోషిస్తోందట.. వీరి పెంపకం విద్య అన్ని బాధ్యతలను కూడా తన భుజానే వేసుకుంది విజే మహి వినోద్.. దీంతో ఈ విషయం తెలిసిన అభిమానుల సైతం ఈమెకు ఫిదా అవుతూ ఉన్నారు.. అయితే తాజా ఫోటోలను చూసి హీరోయిన్స్ మించిన అందం.. ముగ్గురు పిల్లలు తల్లి అయినా కూడా హీరోయిన్ లాగే కనిపిస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: