గీతూ రాయల్ మాట్లాడుతూ.. తాను బ్యాంకాక్ వెళ్లి అనేక రకాల ఆహార పదార్థాలు తిన్నారని.. ముఖ్యంగా అక్కడ బొద్దింకలు పిట్టలు వంటివి తిని వచ్చాను ఎందుకంటే తాను చనిపోయే లోపల అన్ని రుచి చూడాలనుకుని ఉద్దేశంతోనే అలా చేశానని అప్పటినుంచి తనకు అనారోగ్య సమస్యలు మొదలయ్యాయని.. అలాగే కొంతమంది దేవతల వరకు వెళ్లి దర్శించుకోకుండా వెనక తిరిగి వచ్చానని అది కూడా ఒక కారణం కావచ్చు అని అనుమానం తనలో ఉందని తెలుపుతోంది.తన స్నేహితులతో కలిసి తాను ఒకసారి విజయవాడకు వెళ్లాను కానీ అక్కడ అమ్మవారిని దర్శించుకోకుండా అలాగే రావడం జరిగిందని తెలిపింది.
అందుకే తనకు ఇలాంటి సమస్యలు ఎదురవుతున్నాయి అన్నట్లుగా తెలుపుతోంది. ఐదు నెలల నుంచి తాను హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నానని అయితే డాక్టర్లు కోటి మందిలో ఒకరికి వచ్చే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ తనకు మాత్రమే వచ్చిందని తెలిపారంటోంది గీతూ రాయల్. దీంతో రెండేళ్ల పాటు కంటిన్యూస్గా ట్రీట్మెంట్ తీసుకోవాలని వైద్యులు తెలియజేశారు అంటోంది ఈ ముద్దుగుమ్మ. అలాగే ప్రతి వారము కూడా ఇంజక్షన్ తీసుకోవాలని ఈ సమస్యలతో బాగా ఆలోచించి చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయాను అంటూ ఈ వీడియోలో తెలియజేసింది.