బుల్లితెర పైన పలు షోలు చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది యాంకర్ వింధ్య.. ఆ తర్వాత స్పోర్ట్స్ యాంకర్ గా కూడా మారి మరింత క్రేజీని అందుకుంది.. అలాగే ఐపీఎల్ మ్యాచ్లకు కూడా కామెంట్రీ గా చేస్తూ మంచి పాపులారిటీ సంపాదించుకుంది.. సోషల్ మీడియాలో కూడా పలు రకాల పోస్టులను షేర్ చేస్తూ నిత్యం యాక్టివ్గానే ఉంటుంది వింధ్య.. ఇటీవలె ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముద్దుగుమ్మ పలు రకాల విషయాలను వెల్లడించింది..


ముఖ్యంగా తన తల్లి ఎప్పుడు కూడా తనకు ఒక మాట చెబుతూ ఉండేదని నువ్వు ఈ సొసైటీ గురించి ఎక్కువగా ఆలోచించకు వివాహం చేసుకొని పిల్లల్ని కణాలనీ ఎప్పుడు అనుకుంటున్నావో ఆ ఏజ్ లోనే చేసుకోవాలి మిగతావన్నీ కూడా బ్రెయిన్ లో నుంచి తీసేయాలి అంటూ వెల్లడించింది. తమ జీవితంలో తాము ఎంజాయ్ చేయలేకపోయాము కాబట్టి నువ్వైనా బాగా ఎంజాయ్ చేయాలి పెళ్లి చేసుకొని పిల్లల్ని కనకపోయినా పర్లేదు కానీ నీకు నచ్చినట్టుగా ఉంటూ నీ పని నువ్వు చేసుకుంటూ ఉంటే అంతకంటే ఆనందం ఉండదు అంటూ తన తల్లి చెప్పిందని వింధ్య వెల్లడించింది..



ఎవరికోసమో నీ ఇష్టాలని అసలు వదులుకోకు.. నీ క్యారెక్టర్ గురించి ఎవరు ఏమనుకుంటారో అనేది అసలు నువ్వు పట్టించుకోకు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావో అది చెయ్యి.. అందుకే నీకు ఎప్పుడు అది చేయి ఇది చేయి వంటివి ఎప్పుడూ చెప్పలేదు అంటూ తన తల్లి తనకు చెప్పిందని వెల్లడిస్తోంది వింధ్య. ముఖ్యంగా ఐపీఎల్ సీజన్లో ఈ ముద్దుగుమ్మ అందచెందాలతో మైమరిపిస్తూ ఉంటుంది. అలాగే యాంకర్ రవితో కలిసి కూడా నేను రెడీ నువ్వు రెడీ అనే ప్రోగ్రాం కూడా చేసింది వింధ్య. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్గానే ఉంటూ అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇస్తూ ఉంటుంది. తన సక్సెస్ కి కారణం కూడా తన తల్లి ఇంత ఫ్రీడమ్ ఇవ్వడమే అంటూ వెల్లడించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: