ఆ సమయంలో కూడా ముక్కు అవినాష్ అప్పు చేశారని కూడా తెలియజేశారు.ప్రస్తుతం స్టార్ మా చానల్ల
. ప్రసారమవుతున్న కొన్ని ఈవెంట్సులలో షోలలో కనిపిస్తూ ఉన్నారు ముక్కు అవినాష్. తాజాగా ఆయన అంజి టాక్స్ అనే వాటిలో పాల్గొనడం జరిగింది.. ఇందులో జబర్దస్త్ కు సంబంధించి పలు ఆసక్తికరమైన విషయాలు బయట పెట్టాడు అవినాష్.. ముఖ్యంగా అందులో జరిగేటువంటి రాజకీయాలు, రెమ్యూనరేషన్ వివరాలను కూడా వెల్లడించారు.. జబర్దస్త్ లో ఎక్కువగా కామెడీ చేసిన కూడా నిలబడడం సాధ్యం కాదని.. ఏమాత్రం తేడా వచ్చిన వెంటనే వారిని తీసేస్తారని కూడా తెలియజేశారు.
ప్రారంభంలో కంటిస్టెంట్ గా ఆ తర్వాత కార్తీక్ తో పాటు టీమ్ లీడర్ గా కూడా అయ్యాను అయితే ఇందులో చాలానే రాజకీయాలు చేస్తూ ఉంటారని తట్టుకొని నిలబడడం చాలా కష్టమని కూడా తెలియజేశారు అవినాష్. అంతేకాకుండా సీనియర్లతో డైరెక్టర్లతో బాగా క్లోజ్ గా ఉండేవాడిని ఎవరితో ఎలా ఉండాలో తనకి బాగా తెలుసు అని అందుకే అలాంటి రాజకీయాలు తన వద్ద వర్కౌట్ కాలేదని అవినాష్ వెల్లడించారు. మంచి స్కిట్లు చేసి టీమ్ లీడర్ అయ్యాక జబర్దస్త్ పైన తనకు చాలా నమ్మకం ఏర్పడిందని.. టీమ్ లీడర్ అయ్యాక తనకు వారానికి 8 నుంచి 10,000 మాత్రమే మిగిలేవని వెల్లడించారు అవినాష్. తనతో పాటు చేసే వారందరికీ ఇవ్వడంతో అంతే మిగులుతుందని తెలిపారు.అయితే జబర్దస్త్ లో వచ్చే రెమ్యూనరేషన్ తక్కువే అయినా జబర్దస్త్ అనే ట్యాగ్ ను ఉపయోగించి సంపాదించుకునే వారు చాలానే సంపాదిస్తున్నారని తెలిపారు.