
జబర్దస్త్ లో మాజీ కమేడియన్ గా పేరుపొందిన అదిరే అభి.. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తనకు ఒక ప్రశ్న ఎదురవ్వడం జరిగింది.. జబర్దస్త్ కార్యక్రమంలో పాల్గొనే కమెడియన్లకు రెమ్యూనరేషన్ చాలా తక్కువగానే ఉన్నప్పటికీ.. ఆస్తులు మాత్రం కోట్లల్లో సంపాదించారనే ప్రశ్న అడగగా.. ఇది కరెక్ట్ కాదని తెలియజేశారు.. తనకి ఈ కార్యక్రమానికి రాకముందు ఒక సొంత ఇల్లు కారు కూడా ఉంది. అలాగే తాను సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా చేసేవాడినని తెలిపారు. జబర్దస్త్ కార్యక్రమంలో ద్వారా గుర్తింపు సంపాదించుకొని వారందరూ ఇతర కార్యక్రమాలలో కూడా అవకాశాలు సంపాదించుకుంటున్నారని తెలిపారు.
చాలా మంది రాత్రి పగలు తేడా లేకుండానే కష్టపడుతున్నారని అలా కష్టపడి వారు ఆస్తులు సంపాదిస్తున్నారని కూడా తెలియజేశారు.. కేవలం జబర్దస్త్ రెమ్యూనరేషన్ ద్వారా కోట్లల్లో ఆస్తులు సంపాదించారనడం కేవలం రూమర్సు మాత్రమే అంటూ తెలిపారు.. జబర్దస్త్ లో కొనసాగుతున్నటువంటి పలువురు కమెడియన్స్ ఇప్పటికే హైదరాబాదులో చాలా చోట్ల సొంత ఇల్లును కొనుగోలు చేశారని భారీ స్థాయిలో ఆస్తులను సంపాదించుకున్నారని తెలిపారు.. మరి కొంతమంది కమెడియన్స్ సైతం హీరోలుగా డైరెక్టర్లుగా రాణిస్తున్నారు.. అయితే ఈ మధ్యకాలంలో చాలామంది రేటింగ్ పరంగా కాస్త తగ్గిందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.