టాలీవుడ్ లో కమెడియన్ గా మంచి పాపులారిటీ సంపాదించుకున్న ధనరాజ్ జబర్దస్త్ లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. ఎన్నో చిత్రాలలో కూడా తన కామెడీతో మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు ధనరాజ్. అయితే ధనరాజ్ తన సినీ కెరియర్లో సంపాదించిందంతా బాహుబలి సినిమా వల్ల పోగొట్టుకున్నానని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తెలియజేశారు. వాటి గురించి పూర్తిగా తెలుసుకుందాం.


 ధనరాజ్ నిర్మించిన చిత్రం ధనలక్ష్మి తలుపు తడితే.. ఈ సినిమాలో ధనరాజ్ తో పాటు శ్రీముఖి కూడా నటించింది. ఈ సినిమా నష్టపోవడానికి ప్రధాన కారణం బాహుబలి సినిమానే.. అసలు విషయంలోకి వెళ్తే.. ధనలక్ష్మి తలుపు తడితే సినిమా విడుదలైన సమయంలో వరుణ్ తేజ్ నటించిన లోఫర్ సినిమా షూటింగ్ జరుగుతూ ఉండడంతో రాజస్థాన్ కి వెళ్ళామని.. ఆ సమయంలోనే తన సినిమా విడుదల అయ్యిందని.. అప్పటికే మంచి హిట్ టాక్ తో తన సినిమా ముందుకు వెళుతోందని.. కానీ ఆ తర్వాత వారమే బాహుబలి సినిమా విడుదల అవ్వడంతో.. మొదటి వారంలోనే తమ చిత్రాన్ని చూడడానికి ఎవరూ రాలేదనీ తెలిపారు ధనరాజ్


బాహుబలి సినిమా విడుదలయ్యాక కూడా థియేటర్ అగ్రిమెంట్ ప్రకారం ఈ సినిమాని తీసేసారని దీంతో తమ సినిమాకు భారీగా నష్టాలు వచ్చాయని తాను సంపాదించిన డబ్బులతో పాటు తన స్నేహితుల దగ్గర నుంచి అప్పు తీసుకొని మరి ఈ సినిమా చేశాను అంతా కూడా నష్టపోయారని తెలిపారు. కానీ తన భార్య మాత్రం ఈ డబ్బులు ఏదైనా భూమి మీద పెట్టుబడి పెట్టింటే మంచి లాభాలు ఉండేవనీ తెలిపిందని..కానీ తన భార్య మాట వినకుండా సినిమా చేసి చాలా తప్పు చేశానని ధన్ రాజ్ తెలియజేశారు. గతంలో కూడా జబర్దస్త్ లోని హైయెస్ట్ పేమెంట్ తనకే వచ్చేదని తెలిపారు ఒక్కో ఎపిసోడ్కి లక్ష రూపాయలు ఇచ్చేవారని అలా నెలకు 4 లక్షల రూపాయలు వచ్చేదని కూడా తెలిపారు. ప్రస్తుతం ఒక సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడట.

మరింత సమాచారం తెలుసుకోండి: