జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు వీర అభిమానులు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో కూడా చాలామంది ఉన్నారని చెప్పవచ్చు. అలాంటివారిలో షకలక శంకర్ కూడా ఒకరు. ఏకంగా పవన్ కళ్యాణ్ పై అభిమానంతో రూ .7 లక్షల రూపాయల వరకు ఖర్చు చేశానని తెలియజేశారు. మరి అందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం.


షకలక శంకర్ జబర్దస్త్ కార్యక్రమం ద్వారా మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు.. ఆ తర్వాత పలు సినిమాలలో కమెడియన్ గా కూడా నటించి భారీ క్రేజీ సంపాదించుకున్న షకలక శంకర్ ఆ తర్వాత హీరోగా కూడా పలు సినిమాలలో నటించారు. కానీ అవి పెద్దగా సక్సెస్ కాలేకపోవడంతో ఫేడ్ అవుట్ అయ్యారు.. 2019 ఎన్నికల సమయంలో తాను రెండు సినిమాలకు అడ్వాన్స్ తీసుకున్నానని అయితే ఆ డబ్బులను తుఫాను బాధితుల కోసం జనసేన పార్టీకి ఇచ్చేసానని. దాదాపుగా రూ .7 లక్షల రూపాయల వరకు ఖర్చయిందని తెలిపారు. కానీ షకలక శంకర్ తన భార్య పిల్లలు మాత్రం తను డబ్బులు తెస్తానని చాలా ఆశగా ఎదురు చూశారని తెలిపారు.


అయితే ఆ డబ్బులు తాను ఖర్చు చేశానని తన కుటుంబానికి చెప్పానని కానీ తను చేసింది తప్పు కాదని వాళ్లకు తాను చెప్పేది అర్థం కాక నాలుగు రోజులపాటు తన భార్య అసలు మాట్లాడలేదని తెలిపారు. మామయ్య మాత్రం నువ్వు పవన్ కోసం అంత ఖర్చు చేశావు నీకు కనీసం ఫోన్ కానీ మెసేజ్ కానీ చేశారా అంటూ ఎద్దేవా చేశారట..కానీ చిరంజీవి, పవన్ కళ్యాణ్ తో సినిమాలు చేసిన వాళ్లతో ఎప్పుడూ కూడా ఫోటోలు కానీ అడగలేదు. కానీ తను చేసిన పని పవన్ కళ్యాణ్ కి అసలు తెలియదని తెలిపారు షకలక శంకర్. 2024 లో కూడా అభిమానంతోనే ప్రచారం చేసాము తప్ప డబ్బుల కోసం చేయలేదని షకలక శంకర్ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: