ఇటీవల యాంకర్ శ్యామల తరచు సోషల్ మీడియాలో ఈమె గురించి ఏదో ఒక విషయం వినిపిస్తూనే ఉంది. ముఖ్యంగా ఎలక్షన్ లో వైసిపి పార్టీ తరపున ప్రచారంలో దిగినప్పటి నుంచి అటు టిడిపి జనసేన కార్యకర్తలు ఈమెను కావాలనే ఇబ్బంది పెడుతున్నారు. ఇటీవల బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీలో కూడా టాలీవుడ్ సెలబ్రిటీలకు చాలా సమస్యలను తీసుకువచ్చేలా చేస్తోంది. ఇప్పటికి ఈ విషయం పైన చాలామంది సెలబ్రిటీల పేర్లను తీసుకువచ్చారు. అయితే వారందరూ క్లారిటీ ఇచ్చినప్పటికీ కూడా వారి మీద ఇప్పటికీ రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి.


ముఖ్యంగా హీరో శ్రీకాంత్ ,నటి హేమ, జానీ మాస్టర్  లాంటివారు వీడియోలతో క్లారిటీ ఇచ్చారు. అయితే ఈ సంఘటన పైన కేసు నమోదు చేసిన బెంగళూరు పోలీసులు పూర్తిస్థాయిలో కూడా దర్యాప్తు చేబడుతున్నారు.. ఇదంతా ఇలా ఉండగా ఈ వ్యవహారం పైన సోషల్ మీడియాలో యాంకర్ శ్యామల పైన రేవ్ పార్టీలో పాల్గొన్నారని రూమర్స్ రావడంతో యాంకర్ శ్యామల ఇవన్నీ కూడా అసత్య వార్తలంటూ వీడియోతో క్లారిటీ ఇచ్చింది. అయితే మరొకసారి ఇలాంటి తప్పుడు వార్తలు ఎవరైనా ప్రచారం చేస్తే కచ్చితంగా వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానంటూ వార్నింగ్ ఇచ్చింది.


అంతేకాకుండా వారిపైన పరువు నష్టం దావా కూడా వేస్తానంటూ శ్యామల తెలిపింది. కావాలని కొంతమంది ఇలాంటి తప్పుడు కథనాలు డబ్బులు ఇచ్చి మరి రాయిస్తున్నారంటూ ఫైర్ అయ్యింది. ఇటీవల ఎన్నికలలో వైసిపి పార్టీ తరఫున ప్రచారంలో పాల్గొన్న శ్యామల రాజకీయ కక్షతోనే ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తున్నారని తెలియజేసింది. ధైర్యంగా ఎదుర్కొనే సత్తా లేని వాళ్లే ఇలాంటి తప్పుడు వార్తలు రాస్తూ ఉంటారని ఫైర్ అయ్యింది. కచ్చితంగా ఇలా చేస్తే న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని తెలియజేసింది శ్యామల.. మరి దీంతో నైనా ఇకమీదట ఈమె పైన రూమర్స్ ని నిలిపివేస్తారేమో చూడాలి మరి.

మరింత సమాచారం తెలుసుకోండి: