
మా వాట్సాప్ గ్రూపులో ఒకసారి జబర్దస్త్ కమెడియన్ వర్ష ఫోటోను హేమ షేర్ చేసిందని అసలు ఆ ఫోటో ఎందుకు గ్రూపులో పోస్ట్ చేసిందని అందరూ చర్చించుకున్నారని తెలిపింది..అయితే అలా షేర్ చేసిన కొన్ని సెకన్లకి ఆ ఫోటోని డిలీట్ చేసిందని ఆ ఫోటో వేరే గ్రూపులో వేయవలసిన ఇమేజ్ను మరిచిపోయి తమ గ్రూపులో పెట్టినట్లు ఆ తర్వాత హేమ తెలియజేసిందట. అయితే ఆ ఫోటోను ఎందుకు షేర్ చేసింది..? ఆ ఫోటోతో తనకు ఎలాంటి సంబంధం ఉందనే విషయాలను వివరించాల్సి ఉంది అంటూ కరాటే కళ్యాణి ప్రశ్నిస్తోంది.
హేమ బెంగళూరు రేవ్ పార్టీలో సంబంధం లేదని చాలా కవర్ చేయడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. ముఖ్యంగా వంట వీడియోస్, ఫామ్ హౌస్ వీడియోలను కూడా షేర్ చేసి తప్పుదావా పట్టించింది.. కానీ చివరికి అలాంటి పప్పులేవి ఉడకలేదు పోలీసులు ఆమెను ఈ రేవ్ పార్టీలో సంబంధం ఉందంటూ నోటీసులు ఇచ్చారని కూడా తెలిపింది. అందుకే హేమ బయటకు రాకుండా ఇంట్లోనే కూర్చొని ఉందంటూ కరాటే కళ్యాణి తెలిపింది. అయితే ఈ విషయాల పైన పలువురు నెటిజెన్స్ రియాక్ట్ అవుతూ వర్ష నీ కూడా అమ్మేయాలని చూసిందా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.. మొత్తానికి బెంగళూరు రేవ్ పార్టీ వల్ల హేమ పరిస్థితి చాలా దీన పరిస్థితి అయిపోయిందని చెప్పవచ్చు.