ఇటీవల యాంకర్ శ్యామల ఒక వీడియో ద్వారా స్పందిస్తూ ఒకవైపు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కు శుభాకాంక్షలు చెబుతూనే బెదిరింపు కాల్స్ వస్తున్నాయంటూ ఆమె తెలియజేస్తోంది. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే.. ఈసారి జరిగిన ఎన్నికలలో ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నాము ఎన్నికలలో ప్రజలదే అంతిమ తీర్పు ముందుగా భారీ విజయాన్ని అందుకున్న కూటమికి ధన్యవాదాలు.. నారా చంద్రబాబునాయుడు గారు పవన్ కళ్యాణ్ పురందేశ్వరి గారికి హార్దిక శుభాకాంక్షలు.. వైసీపీ గెలుపు కోసం చాలా కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తలకు కూడా ధన్యవాదాలు.. ఎస్ మేము ఓడిపోయాము కానీ ఒకటి గుర్తుపెట్టుకోవాలి గెలిచినప్పుడు విర్రవీగలేదు ఓడిపోయినప్పుడు కృంగిపోవులేదు ఈసారి కూడా జగన్ మరింత బలంగా పుంజుకొని వస్తారని ఆయనకు సపోర్టుగా మనమందరం కలిసి నడవాలని ఎప్పటికీ కూడా జగనన్నతోనే తన ప్రయాణం అంటూ తెలిపింది.
అలాగే చాలామంది బెదిరింపు కాల్స్ కూడా చేస్తున్నారని ఇది ఒక రకంగా భయంగా ఉన్నప్పటికీ.. నాకు నచ్చిందే చేస్తాను అలా అని చెప్పి ఎవరికో నచ్చింది తాను చేయాలని చెప్పి తెలియజేసింది. దయచేసి ఎలాంటి విషయాలను కూడా ఎవరు వ్యక్తిగతంగా తీసుకోవద్దు అంటూ యాంకర్ శ్యామల తెలియజేసింది. అందుకు సంబంధించి వీడియో కూడా వైరల్ గా మారుతున్నది.