సినీ ఇండస్ట్రీలో ఈ మధ్యకాలంలో వెండితెర బుల్లితెర అని తేడా లేకుండా చాలామంది సెలబ్రిటీలు విడాకుల బాట పడుతున్నారు. ముఖ్యంగా బిగ్ బాస్ షోలో చాలామంది లవర్స్ గా అనిపించిన బయటికి వచ్చేసరికి అదంతా షోలో ఆడిన నాటకం అన్నట్లుగా కనిపిస్తోంది. మరి కొంతమంది మా ప్రేమ స్వచ్ఛమైన దంటు వివాహం చేసుకున్న వారు కూడా ఉన్నారు. అలా కన్నడ బిగ్ బాస్ కంటెస్టెంట్ గా పేరుపొందిన చందన్ శెట్టి నివేదిత గౌడ్ కూడా ఈ విషయాన్ని నిరూపించుకున్నారు. బిగ్బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చాక వీరు వివాహం చేసుకోవడం జరిగిందట.


2020 ఫిబ్రవరి 26న వీరి వివాహం చాలా గ్రాండ్గా చేసుకున్నారు.ముఖ్యంగా హనీమూన్ కి సైతం నెదర్లాండ్ వంటి ప్రాంతాలకు కూడా వెళ్లారు ఈ జంట. తరచూ సోషల్ మీడియాలో ఫోటోలను కూడా షేర్ చేస్తూ ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట ఇక కలిసి ఉంటారు అనుకుంటున్న సమయంలో సడన్గా ఒక పెద్ద ట్విస్ట్ ఇచ్చారు.. ఇద్దరు విడిపోయేందుకు నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. బెంగళూరులోని ఫ్యామిలీ కోర్టులో విడాకులకు దరఖాస్తు చేశారని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ విషయం పైన ఇప్పటివరకు అటు చందన్, నివేదిత గౌడ మాత్రం స్పందించలేదు.


కాగా చందన్ శెట్టి, రైల్వే చిల్డ్రన్ ,జోసెఫ్, పొగరు తదితర కన్నడ చిత్రాలకు సంగీత దర్శకుడుగా కూడా పనిచేశారు. తానే సొంతంగా కూడా పాటలు పాడగలడు కన్నడ బిగ్ బాస్ సీజన్-5 లో ఎంట్రీ ఇచ్చి విజేతగా కూడా నిలిచారు ఇదే సీజన్లో నివేదిత కూడా ఎంట్రీ ఇచ్చింది మొదట ఫ్రెండ్స్ అయిన తర్వాత వీరిద్దరూ రిలేషన్ షిప్ లోకి దిగి పెద్దలను ఒప్పించి మరి వివాహం చేసుకున్నారు. ఈ జంట నటించిన క్యాండీ క్రష్ సినిమా కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు. అయితే ఇలాంటి సమయంలోనే ఇలాంటి రూమర్స్ రావడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: