తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ సింగర్ గా పేరు పొందిన నోయల్ ను ప్రేమించి మరి వివాహం చేసుకున్న హీరోయిన్ ఎస్తేర్ నోరోన్హా ప్రతి ఒక్కరికి సుపరిచితమే.. ఈ ముద్దుగుమ్మ వివాహమైన నెలలోపే విడాకులు  తీసుకొని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ తర్వాత పలు చిత్రాలలో బోల్డ్ గా నటించి రెచ్చిపోయింది  ఎస్తేర్. సినిమాలలో అందాల ఆరబోతుల విషయంలో హద్దులు చెరిపేసి మరి నటిస్తోంది. తాజాగా ఇమే డైరెక్టర్గా నిర్మాతగా కూడా మారినట్టు తెలుస్తోంది. ది వెంకెంట్ హౌస్ అనే చిత్రాన్ని నిర్మిస్తున్నదట.


ఇలాంటి సమయంలోనే ఎస్తేర్  ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన వివాహం పైన మాట్లాడుతూ.. యాంకర్ మీరు రెండో వివాహం చేసుకుంటారా అని అడగగా..తను ఒంటరిగా ఉండలేకపోతున్నానని కచ్చితంగా మళ్ళీ వివాహం చేసుకుంటానని తెలియజేసింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కావచ్చు పైన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో మగవాళ్లు మాత్రమే అడగరు..ఆడవాళ్లు కూడా ఆఫర్ చేస్తూ ఉంటారని బాంబు పేల్చింది ఎస్తేర్. అయితే అవకాశాల కోసం క్యారెక్టర్ ని తాను మార్చుకోనని అందు వల్లే తనకు చాలా సినిమాలలో అవకాశాలు రావడంలేదని తెలియజేసింది.


అలాగే ప్రస్తుతం ఉన్న జనరేషన్ కి తగ్గట్టుగా దుస్తులు వేసుకుంటే చాలా మంది తనను ట్రోల్ చేశారని అంతే కాకుండా వేశ్య అంటూ ముద్ర కూడా వేస్తున్నారంటూ చాలా ఫైర్ అయ్యింది. ఆడవాళ్లు అన్నాక కోరికలు ఉండడం సహజమే అదేదో పెద్ద నేరంలా ఈ సమాజం చూస్తుంది అంటూ తెలియజేసింది ఎస్తేర్.. గతంలో ఈ ముద్దుగుమ్మ పలు చిత్రాలలో హీరోయిన్గా నటించిన పెద్దగా సక్సెస్ కాలేకపోయింది.ఆ తర్వాత పలు చిత్రాలలో కీలకమైన పాత్రలలో నటిస్తోంది. కాస్త బొద్దుగా మారడంతో ఈ ముద్దుగుమ్మకు అవకాశాలు తగ్గిపోయాయని వార్తలు కూడా వినిపించాయి. హీరోయిన్ గా ఫేడ్ అవుట్ అయినప్పటికీ.. క్యారెక్టర్ ఆర్టిస్టు గా  మాత్రం అద్భుతమైన పాత్రలో నటిస్తోంది ఎస్తేర్.

మరింత సమాచారం తెలుసుకోండి: