ఇటీవలే జరిగిన సార్వత్రిక ఎన్నికలలో భాగంగా చాలా మంది సెలబ్రిటీలు పాల్గొన్నారు. ముఖ్యంగా జబర్దస్త్ కమెడియన్స్ కూడా పాల్గొనడం జరిగింది. ఏకంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీకి చాలామంది కమెడియన్స్  సపోర్ట్ చేశారు. అయితే జనసేన పార్టీ ఎన్నికలలో కూటమి భారీ విజయాన్ని కూడా అందుకుంది. పవన్ కు డిప్యూటీ సీఎం గా కూడా అవకాశం ఇచ్చారు. అయితే ఈ ఎన్నికలలో జబర్దస్త్ జడ్జ్ నటి రోజా వైసిపి ఎమ్మెల్యే గా నగరి నుంచి పోటీ చేసింది. అయితే ఈ ప్రచారంలో కమెడియన్స్ కు, రోజాకు చాలా సార్లు మాటలు యుద్ధం జరిగిందని కూడా చెప్పవచ్చు.


ఆమె ఎన్నికలలో విఫలం కావడంతో చాలా మంది ఆమెను దారుణంగా కామెంట్స్ చేయడం జరిగింది.. ముఖ్యంగా హైపర్ ఆది, కిరాక్ ఆర్పి ,రోజాని సైతం టార్గెట్ చేశారు.. తాజాగా జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ రోజా కి సపోర్ట్ గా మాట్లాడడం జరిగింది. ఆదికి, ఆర్పి కి సైతం అదిరిపోయే కౌంటర్ వేసినట్లుగా కనిపిస్తోంది. తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న రాకేష్ మాట్లాడుతూ.. రోజా  గారిని అమ్మ అని పిలుస్తూ ఉంటాను తాను ఇబ్బందులలో ఉన్నప్పుడు ధైర్యం చెప్పి అండగా నిలబడింది. తనతో పాటు చాలామంది ఆమె సహాయం కూడా పొందారని తెలిపారు.


స్వయంగా తన చేతుల మీదనే ఎంతోమందికి మేలు చేసిందో తెలిపారు.. ఎవరైనా ఆపదలో ఉండి ఆమె కాళ్ళ మీద పడితే వెంటనే సహాయం చేసేది. ఆమె ఆస్తులు అమ్మి కూడా డబ్బు సహాయం చేసింది అంటూ తెలిపారు. అలాంటి రోజూ అమ్మను  ఈరోజు విమర్శించే వారి వ్యక్తిగతనికే వదిలేస్తున్నాను అంటూ తెలిపారు.. ఏరు దాటాక తెప్ప తగిలి రకం వాళ్లు.. రాజకీయాలు, పదవులు శాశ్వతం కాదు కేవలం మనిషి వ్యక్తిత్వాలే ముఖ్యం అంటూ.. రోజా పైన కామెంట్స్ చేశారు రాకింగ్ రాకేష్. తాజాగా రాకింగ్ రాకేష్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: